ఇండియన్స్‌ను కిడ్నాప్ చేసిన చైనా!

గువహతి: సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్‌లో ఐదుగురు భారత పౌరులను చైనా ఆర్మీ అపహరించిన వార్త కలకలం రేపింది. ఎగువ సుబాన్సిరి జిల్లా నాచో పట్టణ సమీపంలోని అడవిలోకి వేటకు వెళ్లిన తగిన్ కమ్యూనిటీకి చెందిన ఐదుగురిని చైనా ఆర్మీ కిడ్నాప్ చేసిందని స్థానిక పత్రిక అరుణాచల్ టైమ్స్ కథనం ప్రచురించింది. మీడియా, సోషల్ మీడియా రిపోర్టుల ఆధారంగా ఘటనపై దర్యాప్తు చేయడానికి నాచో పోలీసు స్టేషన్ ఇన్‌చార్జీ నేతృత్వంలోని పోలీసు బృందాన్ని […]

Update: 2020-09-05 09:28 GMT

గువహతి: సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్‌లో ఐదుగురు భారత పౌరులను చైనా ఆర్మీ అపహరించిన వార్త కలకలం రేపింది. ఎగువ సుబాన్సిరి జిల్లా నాచో పట్టణ సమీపంలోని అడవిలోకి వేటకు వెళ్లిన తగిన్ కమ్యూనిటీకి చెందిన ఐదుగురిని చైనా ఆర్మీ కిడ్నాప్ చేసిందని స్థానిక పత్రిక అరుణాచల్ టైమ్స్ కథనం ప్రచురించింది.

మీడియా, సోషల్ మీడియా రిపోర్టుల ఆధారంగా ఘటనపై దర్యాప్తు చేయడానికి నాచో పోలీసు స్టేషన్ ఇన్‌చార్జీ నేతృత్వంలోని పోలీసు బృందాన్ని పంపించినట్టు జిల్లా ఎస్పీ తరు గుస్సార్ తెలిపారు. కేవలం నడుచుకుంటూనే వెళ్లడానికే అవకాశమున్న ఈ ప్రాంతానికి వెళ్లిన పోలీసులు తిరిగి రావడానికి రెండు మూడు రోజులు పట్టొచ్చని వివరించారు. అపహరణకు గురైన ఐదుగురు వ్యక్తులతోపాటుగా వెళ్లిన మరో ఇద్దరు తప్పించుకుని గ్రామానికి తిరిగివచ్చి స్థానికులకు చెప్పారని తెలిసింది. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News