NABARD: సీఎం రేవంత్‌తో నాబార్డ్ చైర్మన్ భేటీ.. తక్కువ వడ్డీకి రుణాలివ్వాలని విజ్ఞప్తి
కో-ఆపరేటివ్ సొసైటీలను బలోపేతం చేయాలని, కొత్తగా మరిన్ని కో-ఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కో-ఆపరేటివ్ సొసైటీలను బలోపేతం చేయాలని, కొత్తగా మరిన్ని కో-ఆపరేటివ్ సొసైటీలను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాబార్డ్ చైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. ఇవాళ హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నాబార్డ్ చైర్మన్ షాజీ కేవీ (NABARD Chairman Shaji KV), అధికారులు భేటీ అయ్యారు. సీఎంకు శాలువాతో సత్కరించారు. ఆర్ఐడీఎఫ్ కింద తక్కువ వడ్డీకి రుణాలు, మైక్రో ఇరిగేషన్‌కు నిధులు ఇవ్వాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చైర్మన్‌ను కోరారు. స్వయం సహాయక సంఘాల మహిళా గ్రూపులకు ప్రత్యేక పథకాన్ని రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఐకేపీ, గోడౌన్స్, రైస్ మిల్లులను నాబార్డుకు అనుసంధానం చేసి రాష్ట్రంలో మిల్లింగ్ కెపాసిటీ పెంచేందుకు సహకరించాలని సీఎం కోరారు. కొత్త జిల్లాల్లో డీసీసీబీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి నాబార్డ్ చైర్మన్ ప్రతిపాదించారు.
సీఎంను కలిసిన కాళోజీ వర్సిటి వైస్ చాన్సలర్
ఇదిలా ఉండగా సీఎం తన కార్యాలయంలో (Kaloji NarayanaRao University of Health Sciences) కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ చాన్సలర్ డాక్టర్ పీవీ నందకుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.