దారుణం: మాస్క్ పెట్టుకోలేదని పోలీసుల హింస.. కాళ్లుచేతులకు మేకులు కొట్టి
దిశ, వెబ్‌డెస్క్: కరోనా దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇక ఈ మహమ్మారిని తరిమికొట్టాలంటే మాస్క్ తప్పనిసరి. బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి. అయితే ఈ లాక్ డౌన్ సమయంలో బయట మాస్క్ పెట్టుకోకుండా తిరుగుతున్నవారిపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. వారితో దురుసుగా ప్రవర్తిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటీకే మాస్క్ పెట్టుకోని వారిని పోలీసులు చితక్కొట్టిన ఘటనలు చాలా ఉన్నాయి. తాజాగా ఓ వ్యక్తి మాస్క్ పెట్టుకోలేదని పోలీసులు అతని కాళ్లు, చేతులకు మేకులు కొట్టిన […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇక ఈ మహమ్మారిని తరిమికొట్టాలంటే మాస్క్ తప్పనిసరి. బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి. అయితే ఈ లాక్ డౌన్ సమయంలో బయట మాస్క్ పెట్టుకోకుండా తిరుగుతున్నవారిపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. వారితో దురుసుగా ప్రవర్తిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటీకే మాస్క్ పెట్టుకోని వారిని పోలీసులు చితక్కొట్టిన ఘటనలు చాలా ఉన్నాయి. తాజాగా ఓ వ్యక్తి మాస్క్ పెట్టుకోలేదని పోలీసులు అతని కాళ్లు, చేతులకు మేకులు కొట్టిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..
జోగి నవడ ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల రంజిత్ చెత్త సేకరిస్తూ జీవనం సాగిస్తున్నాడు. మే 24 రాత్రి రంజిత్ చెత్తను ఏరి ఇంటికి వస్తుండగా అక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అతనిని ఆపారు. మాస్క్ ఎందుకు ధరించలేదని ప్రశ్నించారు. రాత్రిపూట, చుట్టూ ఎవరు లేకపోవడంతో కొద్దిగా గాలి పీల్చుకొందామని మాస్క్ ధరించలేదని యువకుడు తెలిపాడు. దీంతో పోలీసులు రెచ్చిపోయారు. యువకుడిపై తమ లాఠీలను ఝుళిపించారు. మాకే ఎదురు సమాధానం చెప్తావా .. అంటూ చితకొట్టారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
మరుసటి రోజు యువకుడి తల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చి తన కుమారుడిని విడిచిపెట్టమని ప్రాధేయపడగా.. ఆమెతో కూడా దురుసుగా వ్యవహరించారు. నీ కొడుకు జైల్లోనే ఉంటాడు.. బయటికి రానివ్వమని బండబూతులు తిట్టారు. రెండు రోజుల తర్వాత యువకుడు ఇంటికి చేరుకొన్నాడు. కానీ.. అతని చేతులకు, కాళ్లకు మేకులు కొట్టి ఉన్నాయి. ఇదేంటని అడిగితే పోలీసులు తనకు ఇలా మేకులు కొట్టినట్లు యువకుడు వాపోయాడు.
ఈ ఘటనపై యువకుడి తల్లి స్థానిక నేతతో కలిసి పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు యువకుడు అబద్దం చెప్తున్నాడని, అతను కానిస్టేబుల్ పై దాడి చేయడంతోనే తాము చేయి చేసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన యూపీలో సంచలనంగా మారింది. ఈ ఘటనపై తాము విచారణ చేపడతామని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.