గ్రేటా థన్ బర్గ్ పై కేసు నమోదు
దిశ,వెబ్‌డెస్క్: స్వీడన్‌కు చెందిన యువ పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్ బర్గ్ పై పోలీసు కేసు నమోదైంది. నేరపూరిత కుట్ర, మతం ఆధారంగా శత్రుత్వాన్ని ప్రోత్సహిస్తుందన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. కాగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు నిర్వహిస్తున్న రైతులకు మద్దతుగా ఆమె ట్వీట్ చేశారు. భారత్‌లో రైతుల నిరసనలకు తాను సంఘీభావం తెలుపుతున్నట్టు ట్వీట్ లో పేర్కొన్నారు. అంతే కాకుండా సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పోరాటం, […]
దిశ,వెబ్‌డెస్క్: స్వీడన్‌కు చెందిన యువ పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్ బర్గ్ పై పోలీసు కేసు నమోదైంది. నేరపూరిత కుట్ర, మతం ఆధారంగా శత్రుత్వాన్ని ప్రోత్సహిస్తుందన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. కాగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు నిర్వహిస్తున్న రైతులకు మద్దతుగా ఆమె ట్వీట్ చేశారు.
భారత్‌లో రైతుల నిరసనలకు తాను సంఘీభావం తెలుపుతున్నట్టు ట్వీట్ లో పేర్కొన్నారు. అంతే కాకుండా సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పోరాటం, నిరసన స్థలాలకు సమీపంలో ఇంటర్నెట్ పై ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించిందనే అంశాలపై సీఎన్ఎన్ ఛానెల్ రాసిన ఓ ఆర్టికల్‌ను కూడా షేర్ చేసింది. ఆమె చేసిన ఈ ట్వీట్ ద్వారా ప్రపంచం మొత్తం ఒక్కసారిగా రైతుల నిరసనల వైపు తిరిగి చూసిన సంగతి తెలిసిందే.