రంగంలోకి దిగిన పోలీసులు.. మొదటి రోజు ఇలా

దిశ ప్రతినిది, కరీంనగర్: లాక్ డౌన్ లో బాగంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు మోహరించారు. మొదటి రోజు అయినందున పోలీసులు షాపులు మూసి వేయాలని, రోడ్లపై జనాలు ఉండకూడదని వార్నింగ్ లు ఇస్తున్నారు. రేపేటి నుండి ఫైన్లు, కేసులు పెట్టె యోచనలో ఉన్నట్టు సమాచారం. కరీంనగర్ లోని కార్ఖనగడ్డ, టవర్ సర్కిల్, కోతిరాంపూర్, మంకమ్మతోట, కోర్టు చౌరస్తా తదితర ప్రాంతాల్లో బందోబస్తు చర్యలు చేపట్టారు. పెట్రోలింగ్ పార్టీలు కూడా నగరమంతా తిరుగుతున్నాయి. గురువారం నుండి 10 […]

Update: 2021-05-12 00:28 GMT

దిశ ప్రతినిది, కరీంనగర్: లాక్ డౌన్ లో బాగంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు మోహరించారు. మొదటి రోజు అయినందున పోలీసులు షాపులు మూసి వేయాలని, రోడ్లపై జనాలు ఉండకూడదని వార్నింగ్ లు ఇస్తున్నారు. రేపేటి నుండి ఫైన్లు, కేసులు పెట్టె యోచనలో ఉన్నట్టు సమాచారం. కరీంనగర్ లోని కార్ఖనగడ్డ, టవర్ సర్కిల్, కోతిరాంపూర్, మంకమ్మతోట, కోర్టు చౌరస్తా తదితర ప్రాంతాల్లో బందోబస్తు చర్యలు చేపట్టారు. పెట్రోలింగ్ పార్టీలు కూడా నగరమంతా తిరుగుతున్నాయి. గురువారం నుండి 10 గంటలు దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అసలే పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో షాపింగ్ చేసేందుకు పెద్ద ఎత్తున జనం వచ్చే అవకాశాలు ఉన్నాయని గుర్తించిన పోలీసులు మాల్స్ కు, వ్యాపారులకు ముందస్తుగానే సమాచారం ఇస్తున్నారు. లాక్ డౌన్ టైంలో నిభందనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తున్నారు. రోడ్లపై తిరుగుతున్న వారు బలమైన కారణాలు, అందుకు తగిన ఆధారాలు చూపించకున్నా క్రిమినల్ చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Tags:    

Similar News