‘‘గర్భిణిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు‘‘

దిశ, న్యూస్ బ్యూరో: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) కట్టడికి విధించిన లాక్‌డౌన్ రోజుల్లో ఎంత పని ఒత్తిడిలో ఉన్నా, లాఠీలతో చితకబాదుతున్నారన్న పలు విమర్శలు వస్తున్నా పోలీసులు తమ డ్యూటీని కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు తమ శాఖ వాహనాలను ప్రజల సౌకర్యం కోసం ఉపయోగిస్తున్నారు. శుక్రవారం ఉదయం హుస్సేన్ హాలం పోలీసులు ప్రెగ్నెన్సీతో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను గమనించి పెట్రోలింగ్ వెహికల్‌లో దగ్గరలోని నవసేన ఆస్పత్రికి తరలించారు. సదరు […]

Update: 2020-04-24 06:43 GMT

దిశ, న్యూస్ బ్యూరో:

నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) కట్టడికి విధించిన లాక్‌డౌన్ రోజుల్లో ఎంత పని ఒత్తిడిలో ఉన్నా, లాఠీలతో చితకబాదుతున్నారన్న పలు విమర్శలు వస్తున్నా పోలీసులు తమ డ్యూటీని కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు తమ శాఖ వాహనాలను ప్రజల సౌకర్యం కోసం ఉపయోగిస్తున్నారు. శుక్రవారం ఉదయం హుస్సేన్ హాలం పోలీసులు ప్రెగ్నెన్సీతో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను గమనించి పెట్రోలింగ్ వెహికల్‌లో దగ్గరలోని నవసేన ఆస్పత్రికి తరలించారు. సదరు మహిళ మధ్యప్రదేశ్‌కు చెందిన వలస కూలీ కాగా.. ఫాతిమా కాలనీలోని ఓ భవనం నిర్మాణ పనులు చేస్తోంది. మహిళను ఆస్పత్రికి తరలించిన సిబ్బందిని ఎస్‌హెచ్‌వో రమేష్ కొత్వాల్ అభినందనలు తెలిపారు.

Tags: Police, Help, people, Lock down, Migrant Worker, Pregnant Lady, Hospital

Tags:    

Similar News