ఫ్లాష్.. ఫ్లాష్.. ప్రగతిభవన్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు

దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యోగ నోటిఫికేషన్ సాధనే ధ్యేయంగా విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు పిలుపునిచ్చిన ‘ప్రగతి భవన్ ముట్టడి’ని ఎలాగైనా ఆపేందుకు పోలీసు శాఖ సిద్ధమైంది. దీంతో ప్రగతి భవన్ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ప్రగతిభవన్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన వారిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుంటున్నారు. దాదాపు 500 మందికి పైగా నిరుద్యోగులు ప్రగతి భవన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వందల సంఖ్యలో మోహరించిన పోలీసు బలాగాలు ప్రగతి భవన్ పరిసర […]

Update: 2021-08-24 00:43 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యోగ నోటిఫికేషన్ సాధనే ధ్యేయంగా విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు పిలుపునిచ్చిన ‘ప్రగతి భవన్ ముట్టడి’ని ఎలాగైనా ఆపేందుకు పోలీసు శాఖ సిద్ధమైంది. దీంతో ప్రగతి భవన్ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ప్రగతిభవన్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన వారిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుంటున్నారు. దాదాపు 500 మందికి పైగా నిరుద్యోగులు ప్రగతి భవన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వందల సంఖ్యలో మోహరించిన పోలీసు బలాగాలు ప్రగతి భవన్ పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

అయితే కార్యక్రమంలో PDSU రాష్ట్ర అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్, S. నాగేశ్వర్ రావు PDSU రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పందిరి మహేష్ PDSU రాష్ట్ర ఉపాధ్యక్షుడు, బోవెన్‌పల్లి రాము, PDSU రాష్ట్ర కార్యదర్శి భూషణవేణి కృష్ణ, PYL హైడ్, నగర అధ్యక్షుడు రవి కుమార్, PYL రాష్ట్ర నాయకుడు పడాల సృజన్ గౌడ్, PYL హైడ్, నగర ఉపాధ్యక్షుడు కుంబోజి కిరణ్, పీవైఎల్ హైదరాబాద్ అశోక్ నగర్ ఇంచార్జ్ కె. కాశీనాథ్, పీవైఎల్ నారాయణపేట జిల్లా కార్యదర్శి. నిరుద్యోగ JAC సభ్యులు నిరసన కార్యక్రమానికి తమ సంఘీభావం తెలిపారు. అంతేకాకుండా వీరు ప్రగతిభవన్ ముట్టడిలో పాల్గొనే అవకాశం కూడా ఉంది.

Tags:    

Similar News