కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు

దిశ, హైదరాబాద్: ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగేండ్ల బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర తెలిపిన ప్రకారం.. ఫరూక్ నగర్‎కు చెందిన రఫియా సుల్తానా ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో షామా టాకీస్ దగ్గర గరీబ్ నవాజ్ క్లినిక్ కు వైద్యం నిమిత్తం భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి వెళ్లారు. ఈ నేపథ్యంలో తన రెండో కుమారుడు షేక్ అబ్దుల్ […]

Update: 2020-05-24 10:55 GMT

దిశ, హైదరాబాద్: ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగేండ్ల బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర తెలిపిన ప్రకారం.. ఫరూక్ నగర్‎కు చెందిన రఫియా సుల్తానా ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో షామా టాకీస్ దగ్గర గరీబ్ నవాజ్ క్లినిక్ కు వైద్యం నిమిత్తం భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి వెళ్లారు. ఈ నేపథ్యంలో తన రెండో కుమారుడు షేక్ అబ్దుల్ వాహెబ్ ఆస్పత్రి ఎదుట ఇతర పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి ఆ ప్రదేశంలో తన కుమారుడు లేకపోవడాన్ని గమనించిన రఫియా సుల్తానా క్లినిక్ పరిసర ప్రాంతాల్లో వెతికింది. ఎంతకీ ఆచూకీ తెలియకపోయే సరికి అదే రోజు సాయంత్రం 6.30 గంటలకు ఫలక్ నూమా పీఎస్ లో ఫిర్యాదు చేసింది. ఈ కేసును పలు కోణాల్లో విచారించిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు దూద్ బౌలికి చెందిన సమ్రీన్ బాలుడిని కిడ్నాప్ చేసినట్టు గుర్తించారు. నిందితురాలిపై కేసు నమోదు చేసి.. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.

Tags:    

Similar News