బెయిల్‌పై బయటకొచ్చి.. భారీగా బైక్‌లు దొంగిలించి
దిశ, నిజామాబాద్: ద్విచక్ర వాహనాలను దొంగిలించే ఘరాన దొంగను నిజామాబాద్ పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి భారీగా వాహనాలు స్వాదీనం చేసుకున్నారు. సోమవారం ఏసీపీ శ్రీనివాస్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇవాళ తెల్లవారుజామున 5.00 గంటల సమయంలో నగరంలోని 5వ టౌన్ ఎస్‌ఐ జాన్ రెడ్డి, అతని సిబ్బంది కలిసి వర్నిx రోడ్డు దగ్గర పెట్రోలింగ్ చేపట్టారు. ఒక వ్యక్తి మోటార్ సైకిల్ రాగా అతన్ని ఆపి, బండికి సంబంధించిన కాగితాలు అడిగారు. సదరు వాహనదారుడు […]
దిశ, నిజామాబాద్: ద్విచక్ర వాహనాలను దొంగిలించే ఘరాన దొంగను నిజామాబాద్ పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి భారీగా వాహనాలు స్వాదీనం చేసుకున్నారు. సోమవారం ఏసీపీ శ్రీనివాస్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇవాళ తెల్లవారుజామున 5.00 గంటల సమయంలో నగరంలోని 5వ టౌన్ ఎస్‌ఐ జాన్ రెడ్డి, అతని సిబ్బంది కలిసి వర్నిx రోడ్డు దగ్గర పెట్రోలింగ్ చేపట్టారు. ఒక వ్యక్తి మోటార్ సైకిల్ రాగా అతన్ని ఆపి, బండికి సంబంధించిన కాగితాలు అడిగారు. సదరు వాహనదారుడు సమాధానం ఇవ్వకుండా అలాగే ఉండిపోయాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు గట్టిగా నిలదీయగా, అతను దొంగ అని తేలింది. తన పేరు మహమ్మద్ హైమద్ హుస్సేన్ అని నిర్మల్ జిల్లా బైంసా పట్టణం అని చెప్పాడు. తాను నడుపుతున్న మోటార్ సైకిల్ నిజామాబాద్‌లోని ఆనంద్‌నగర్‌లో గల ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఇంటి ముందర ఉన్న బైక్‌ను కొన్ని రోజుల క్రితం దొంగిలించానని ఒప్పుకున్నాడు. నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్టు ఒప్పుకున్నాడు. మొత్తం 29 బైకులను దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నాడు. దీంతో వాహనాలన్నీ సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అంతేగాకుండా 2018లో దాదాపు 17 మోటార్ సైకిల్‌ను దొంగతనం చేసిన కేసులో రిమాండ్ అయ్యి, నాలుగు నెలలు జైలు శిక్ష కూడా పడింది. ప్రస్తుతం అతను బెయిల్‌పైన బయటకొచ్చి దొంగతనాలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో పాల్గొన్న పోలీసులును ఏసీపీ అభినందించారు.