భారీగా బంగారం స్వాధీనం.. 12 మంది అరెస్ట్
దిశ, కరీంనగర్: గోదావరిఖని పట్టణంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 12 మంది నిందితులను అరెస్ట్ చేసినట్టు డీసీపీ రవిందర్ తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… వ్యసనాలకు, జల్సాలకు అలవాటు పడి, దొంగతనాలు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశామన్నారు. వీరు తాళం వేసిన ఇళ్లకు కన్నం వేస్తూ చోరీలు చేస్తున్నారని చెప్పారు. నిందితుల్లో 12 మందిని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు డీసీపీ తెలిపారు. దాదాపు 16 ఇళ్లలో చోరీలకు […]
దిశ, కరీంనగర్: గోదావరిఖని పట్టణంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 12 మంది నిందితులను అరెస్ట్ చేసినట్టు డీసీపీ రవిందర్ తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… వ్యసనాలకు, జల్సాలకు అలవాటు పడి, దొంగతనాలు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశామన్నారు.
వీరు తాళం వేసిన ఇళ్లకు కన్నం వేస్తూ చోరీలు చేస్తున్నారని చెప్పారు. నిందితుల్లో 12 మందిని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు డీసీపీ తెలిపారు. దాదాపు 16 ఇళ్లలో చోరీలకు పాల్పడిన వీరిపై 8 కేసులు నమోదయ్యాయని, రూ.15 లక్షల విలువైన 25 తులాల బంగారం, 40 తులాల వెండి, టీవీ, ల్యాప్ టాప్, రూ.30,000 నగదు స్వాధీనం చేసుకున్నాని చెప్పారు.