అలా తప్పిపోయాడు.. ఇలా పట్టుకున్నారు

దిశ, ఆదిలాబాద్: మూడేళ్ల బాలుడు కిరాణా షాపు‌కు వెళ్లి తిరిగి రాలేదు. హైరానా పడ్డ తల్లిదండ్రులు 100కు డయల్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు 20 నిమిషాల్లో తప్పిపోయిన ఆ బుడతడి ఆచూకీ కనుగొన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రానికి చెందిన కొండూరి మోహన్, స్వప్న దంపతులు నిర్మల్ పట్టణంలోని చింతకుంటవాడలోని తమ బంధువుల ఇంటికి వచ్చారు. వీరి మూడేళ్ల తనయుడు విహాన్ష్ ఇంటి ముందు ఉండే షాప్‌లో చాక్లెట్ కొనేందుకు […]

Update: 2020-06-06 09:55 GMT

దిశ, ఆదిలాబాద్: మూడేళ్ల బాలుడు కిరాణా షాపు‌కు వెళ్లి తిరిగి రాలేదు. హైరానా పడ్డ తల్లిదండ్రులు 100కు డయల్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు 20 నిమిషాల్లో తప్పిపోయిన ఆ బుడతడి ఆచూకీ కనుగొన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రానికి చెందిన కొండూరి మోహన్, స్వప్న దంపతులు నిర్మల్ పట్టణంలోని చింతకుంటవాడలోని తమ బంధువుల ఇంటికి వచ్చారు. వీరి మూడేళ్ల తనయుడు విహాన్ష్ ఇంటి ముందు ఉండే షాప్‌లో చాక్లెట్ కొనేందుకు వెళ్లి వాహనాల రద్దీతో దారి తప్పి ఇంటికి రాకుండా ఇందిరానగర్ వైపు వెళ్లాడు. ఎంత సేపటికి రాకపోయే సరికి తల్లిదండ్రులు 100కు డయల్ చేశారు. సీఐ జాన్ దివాకర్, ఎస్సై రమేశ్ వెంటనే పెట్రోకార్, బ్లూ కోల్ట్స్ పోలీసులను రంగంలోకి దింపారు. నలువైపులా చుట్టుముట్టి విహాన్ష్‌ను ఇందిరానగర్‌లో గుర్తించి తల్లిదండ్రుల‌కు అప్పగించడంతో కథ సుఖాంతమైంది.

Tags:    

Similar News