పల్లె పహాడ్ బాధితుల జీవితాలతో ఆడుకుంటున్న అధికారులు..

దిశ ప్రతినిధి, మెదక్ : మల్లన్నసాగర్ ప్రాజెక్టులో దాదాపు అన్ని గ్రామాల ప్రజలను ఆర్‌ అండ్ ఆర్ కాలనీకి తరలించారు. అయినా ఇంకొంత మంది ముంపు గ్రామాల్లోనే ఉంటున్నారు. ఆ గ్రామాల్లో అధికారులు విద్యుత్ నిలిపివేయడంతో ఆయా గ్రామాల ప్రజలు అంధకారంలో ఉండాల్సి వస్తోంది. ఈ విషయాన్ని పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదు. దీంతో, పల్లె పహాడ్ గ్రామ ప్రజలు సుమారు నలభై కుటుంబాల వరకు స్వచ్చందంగా ఆర్ అండ్ ఆర్ కాలనీకి వెళ్లారు. వారు వెళ్లి […]

Update: 2021-07-28 10:34 GMT

దిశ ప్రతినిధి, మెదక్ : మల్లన్నసాగర్ ప్రాజెక్టులో దాదాపు అన్ని గ్రామాల ప్రజలను ఆర్‌ అండ్ ఆర్ కాలనీకి తరలించారు. అయినా ఇంకొంత మంది ముంపు గ్రామాల్లోనే ఉంటున్నారు. ఆ గ్రామాల్లో అధికారులు విద్యుత్ నిలిపివేయడంతో ఆయా గ్రామాల ప్రజలు అంధకారంలో ఉండాల్సి వస్తోంది. ఈ విషయాన్ని పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదు.

దీంతో, పల్లె పహాడ్ గ్రామ ప్రజలు సుమారు నలభై కుటుంబాల వరకు స్వచ్చందంగా ఆర్ అండ్ ఆర్ కాలనీకి వెళ్లారు. వారు వెళ్లి సుమారు ఆరెడు నెలలు గడుస్తోంది. ప్రస్తుతం మిమ్మల్ని ఎవరు ఆర్ అండ్ ఆర్ కాలనీకి రమ్మన్నారు. మీకు ఇండ్లు కేటాయించలేదు.. మీరు మీ గ్రామాలకు వెళ్లిపొండి అంటూ పోలీసు పహారా మధ్యలో పల్లెపహాడ్ ముంపు గ్రామాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. అధికారులు దగ్గరుండి ఆర్ అండ్ ఆర్ కాలనీకి వెళ్లాలని చెప్పాల్సింది పోయి.. అక్కడి నుంచి వెళ్లగొట్టడంపై ముంపు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కనీసం మా గ్రామంలో విద్యుత్, తాగునీటి సౌకర్యం లేదని, ఇది అసలే వానాకాలం.. ఏమైనా పురుగు పూసి ఉంటే మా పరిస్థితి ఏంటంటూ ఆందోళన చెందుతున్నారు. దీనిపై సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి హరీశ్ రావు తక్షణమే స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Tags:    

Similar News