240 నిమిషాల్లో మిస్సింగ్ కేసు ఛేదించిన పోలీసులు
దిశ, కూకట్‌పల్లి: హైదరాబాద్‌లో నాలుగేళ్ల బాలుడి మిస్సింగ్ కేసును పోలీసులు 240 నిమిషాల్లో ఛేదించారు. వివరాల్లోకి వెళ్తే.. కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మూసాపేట్ ఆంజనేయనగర్ చెందిన రోహిత్ (4) ఇంటి ముందు ఆడుకుంటూ శుక్రవారం కనిపించకుండా పోయాడు. దీంతో సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో రోహిత్ కుటుంబ సభ్యులు కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఎస్సై సురేష్ అన్ని పోలీస్‌స్టేషన్‌లకు సమాచారం అందించారు. రోడ్లపై ఉన్న సీసీ కెమెరాల సహాయంతో రోహిత్ కదలికలను […]
దిశ, కూకట్‌పల్లి: హైదరాబాద్‌లో నాలుగేళ్ల బాలుడి మిస్సింగ్ కేసును పోలీసులు 240 నిమిషాల్లో ఛేదించారు. వివరాల్లోకి వెళ్తే.. కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మూసాపేట్ ఆంజనేయనగర్ చెందిన రోహిత్ (4) ఇంటి ముందు ఆడుకుంటూ శుక్రవారం కనిపించకుండా పోయాడు.
దీంతో సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో రోహిత్ కుటుంబ సభ్యులు కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఎస్సై సురేష్ అన్ని పోలీస్‌స్టేషన్‌లకు సమాచారం అందించారు. రోడ్లపై ఉన్న సీసీ కెమెరాల సహాయంతో రోహిత్ కదలికలను గుర్తించారు. ఇంతలో రోడ్డుపై ఒంటరిగా కనిపించిన రోహిత్‌ను మియాపూర్ ప్రాంతంలో స్మైల్ టీమ్ సభ్యులు గుర్తించి పోలీస్‌స్టేషన్‌లో అప్పజెప్పారు. సమాచారం తెలుసుకున్న కూకట్‌పల్లి పోలీసులు మియాపూర్ వెళ్లి పరిశీలించగా రోహిత్‌గా గుర్తించారు. రాత్రి 9 గంటల లోపు బాలుడిని వారి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు.