కప్పలకుంటతండాలో పోలీసుల కార్డన్‌ సెర్చ్‌

దిశ, మేళ్లచెరువు: కప్పలకుంటతండాలో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ చేసి సరైన ధృవపత్రాలు లేని టూవీలర్స్, ట్రాక్టర్‌ స్వాదీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మేళ్లచెరువు మండలంలోని కప్పలకుంట తండా గ్రామ పంచాయతీ పరిధిలో కోదాడ డీఎస్పీ రఘు ఆధ్వర్యంలో శనివారం రాత్రి పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన డాక్యుమెంట్స్ లేని 32 టూ వీలర్స్, ఒక ట్రాక్టర్‌ను స్వాదీనం చేసుకున్నారు. అనంతరం డీఎస్పీ గ్రామస్తులతో మాట్లాడుతూ బంగారం మెరుగు పెడతామని చెప్పి మోసం చేసే […]

Update: 2021-10-30 10:31 GMT

దిశ, మేళ్లచెరువు: కప్పలకుంటతండాలో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ చేసి సరైన ధృవపత్రాలు లేని టూవీలర్స్, ట్రాక్టర్‌ స్వాదీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మేళ్లచెరువు మండలంలోని కప్పలకుంట తండా గ్రామ పంచాయతీ పరిధిలో కోదాడ డీఎస్పీ రఘు ఆధ్వర్యంలో శనివారం రాత్రి పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన డాక్యుమెంట్స్ లేని 32 టూ వీలర్స్, ఒక ట్రాక్టర్‌ను స్వాదీనం చేసుకున్నారు. అనంతరం డీఎస్పీ గ్రామస్తులతో మాట్లాడుతూ బంగారం మెరుగు పెడతామని చెప్పి మోసం చేసే వారి పట్ల, చైన్‌ స్నాచింగ్‌ వారి పట్ల, నకిలీ విత్తనాలు అమ్మేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అటువంటి కనబడితే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. సీజ్‌ చేసిన వాహనాలు సరైన పత్రాలు చూపిస్తే విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నలుగురు సీఐలు, 15 మంది ఎస్సైలు, 15 మంది పీఎస్‌ఐలు, 10 ఏఎస్సైలు, 50 మంది కానిస్టేబుళ్లు, సిబ్బది పాల్గొన్నారు.

Tags:    

Similar News