ఓటు హక్కు వినియోగించుకున్న కమిషనర్ దంపతులు
దిశ, సిద్దిపేట: సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని నాసర్‌పురా ఉర్దూ మీడియం స్కూల్ మోడల్ పోలింగ్ కేంద్రంలో పోలీస్ కమిషనర్ దంపతులు జోయల్ డేవిస్, డాక్టర్ ఏ.రాజ్‌ప్రతీపతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో ఓటు హక్కు ఉన్న ప్రతిఒక్కరూ తప్పకుండా వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యానికి ఓటుహక్కు వజ్రాయుధం అని తెలిపారు. పోలింగ్ కేంద్రానికి వచ్చే వాళ్లు తప్పకుండా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. కోవిడ్ […]
దిశ, సిద్దిపేట: సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని నాసర్‌పురా ఉర్దూ మీడియం స్కూల్ మోడల్ పోలింగ్ కేంద్రంలో పోలీస్ కమిషనర్ దంపతులు జోయల్ డేవిస్, డాక్టర్ ఏ.రాజ్‌ప్రతీపతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో ఓటు హక్కు ఉన్న ప్రతిఒక్కరూ తప్పకుండా వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యానికి ఓటుహక్కు వజ్రాయుధం అని తెలిపారు. పోలింగ్ కేంద్రానికి వచ్చే వాళ్లు తప్పకుండా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగడానికి అన్ని భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు.