హుజురాబాద్‌లో మనుషులను తినే నరభక్షకులు.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు

దిశ, హుజురాబాద్ రూరల్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో హుజురాబాద్‎తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భయాందోళనలకు గురి చేస్తోంది. ప్రజలను తినే నరభక్షకులు వచ్చారంటూ వీడియోలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల హుజురాబాద్‎లో నరభక్షకుల గ్యాంగ్‎కు సంబంధించిన ఒకరు యాక్సిడెంట్‎లో చనిపోయారంటూ ఓ వీడియో వైరల్ అవుతుంది. వీడియో సారాంశం.. ‘హుజురాబాద్ హైవే మీద మనుషులను తినే నరభక్షకులు ఒకరు ప్రమాదంలో చనిపోయారు. వారు మొత్తం 12 మంది ఉన్నారు. మిగతా 11 మంది బయట […]

Update: 2021-11-30 05:08 GMT

దిశ, హుజురాబాద్ రూరల్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో హుజురాబాద్‎తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భయాందోళనలకు గురి చేస్తోంది. ప్రజలను తినే నరభక్షకులు వచ్చారంటూ వీడియోలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల హుజురాబాద్‎లో నరభక్షకుల గ్యాంగ్‎కు సంబంధించిన ఒకరు యాక్సిడెంట్‎లో చనిపోయారంటూ ఓ వీడియో వైరల్ అవుతుంది.

వీడియో సారాంశం..

‘హుజురాబాద్ హైవే మీద మనుషులను తినే నరభక్షకులు ఒకరు ప్రమాదంలో చనిపోయారు. వారు మొత్తం 12 మంది ఉన్నారు. మిగతా 11 మంది బయట తిరుగుతున్నారు. వారు ఏ ఊర్లో నుంచి వస్తున్నారో కూడా తెలియడం లేదు. ప్రజలందరూ కర్రలు పట్టుకుని సిద్ధంగా ఉండాలి’ అంటూ అప్రమత్తం చేస్తున్న ఒక వీడియో వైరల్ అవుతుంది.

పోలీసుల క్లారిటీ..

ఈ వైరల్ వీడియో‌పై స్పందించిన సీఐ శ్రీనివాస్ అలాంటి సంఘటనలు ఏమీ హుజురాబాద్ ప్రాంతంలో జరగలేదని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు నరభక్షకులకు సంబంధించిన ఎలాంటి సమాచారం తమవరకు చేరలేదని, ఇది ఫేక్ వీడియో అయి ఉంటుందని అంటున్నారు. ఇలాంటి వీడియోలు పోస్ట్ చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిజంగా అలాంటివి ఏమైనా ఉంటే వెంటనే తమకు సమాచారం అందించాలన్నారు. పోలీసులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉన్నారని, ప్రజలు ఫేక్ వీడియోలను నమ్మవద్దని సూచించారు.

Tags:    

Similar News