చింతకాయల అయ్యన్న పాత్రుడుపై కేసు నమోదు

దిశ, ఏపీ బ్యూరో: విశాఖ జిల్లా టీడీపీ నేత చింతకాయల అయ్యన‍్న పాత్రుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. నర్సీపట్నం మున్సిపల్‌ కార్యాలయంలో చింతకాయల అయ్యన్న పాత్రుడు తాత లచ్చాపాత్రుడు ఫోటోని ఒక గదిలోంచి మరో గదిలో తాత్కాలికంగా మార్చడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం ఫోటో మార్పుపై మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసిన అయ్యన్న పాత్రుడు తనను దుర్భాషలాడారంటూ మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణవేణి […]

Update: 2020-06-16 11:35 GMT

దిశ, ఏపీ బ్యూరో: విశాఖ జిల్లా టీడీపీ నేత చింతకాయల అయ్యన‍్న పాత్రుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. నర్సీపట్నం మున్సిపల్‌ కార్యాలయంలో చింతకాయల అయ్యన్న పాత్రుడు తాత లచ్చాపాత్రుడు ఫోటోని ఒక గదిలోంచి మరో గదిలో తాత్కాలికంగా మార్చడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెండు రోజుల క్రితం ఫోటో మార్పుపై మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసిన అయ్యన్న పాత్రుడు తనను దుర్భాషలాడారంటూ మున్సిపల్‌ కమిషనర్‌ కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News