భారీగా గంజాయి తగులబెట్టిన పోలీసులు

దిశ, విశాఖపట్నం: పోలీసుల తనిఖీలో పట్టుబడిన 22,429 కిలోల గంజాయిని బుధవారం నర్సీపట్నంలో పోలీస్, ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో తగులబెట్టారు. అనంతరం విశాఖ రేంజ్‌ డీఐజీ కె.రంగరావు మాట్లాడుతూ.. విశాఖ జిల్లాలోని 41వ పోలీస్ స్టేషన్ పరిధిలో 657 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 22,429 కిలోల గంజాయి విలువ సుమారు రూ.20కోట్లు ఉంటుందన్నారు. అలాగే ఇటీవల గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డ 113 వాహనాలను వేలం వేశామని, మిగిలిన వాహనాలకు ప్రభుత్వ అనుమతి తీసుకొని మరోసారి వేలం […]

Update: 2020-12-09 06:31 GMT

దిశ, విశాఖపట్నం: పోలీసుల తనిఖీలో పట్టుబడిన 22,429 కిలోల గంజాయిని బుధవారం నర్సీపట్నంలో పోలీస్, ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో తగులబెట్టారు. అనంతరం విశాఖ రేంజ్‌ డీఐజీ కె.రంగరావు మాట్లాడుతూ.. విశాఖ జిల్లాలోని 41వ పోలీస్ స్టేషన్ పరిధిలో 657 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 22,429 కిలోల గంజాయి విలువ సుమారు రూ.20కోట్లు ఉంటుందన్నారు. అలాగే ఇటీవల గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డ 113 వాహనాలను వేలం వేశామని, మిగిలిన వాహనాలకు ప్రభుత్వ అనుమతి తీసుకొని మరోసారి వేలం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. గంజాయి అక్రమ రవాణాలో పట్టుబడ్డ 17 మందిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, నర్సీపట్నం ఎఎస్పీ తుహిన్‌సిన్హా, ఇతర డీఎస్పీలు, ఎక్సైజ్‌శాఖ అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News