బీజేపీ నేతల అరెస్ట్.. స్టేషన్ లోనే ధర్నా..
దిశ, జిన్నారం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపుమేరకు నిరుద్యోగ దీక్ష కు బయలుదేరి వెళ్తున్న సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు స్టేషన్ లో నిరసన వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ స్టేషన్ లోనే ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి […]
దిశ, జిన్నారం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపుమేరకు నిరుద్యోగ దీక్ష కు బయలుదేరి వెళ్తున్న సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు స్టేషన్ లో నిరసన వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులు చేయడం సరికాదన్నారు.
ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ స్టేషన్ లోనే ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ప్రతాపరెడ్డి, పార్టీ నాయకులు పల్నాటి శ్రీనివాస్, రమేష్, సుధాకర్, లక్ష్మణ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.