దొంగలను పట్టించిన కాగితం ముక్క

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా నడికుడి స్టేట్‌ బ్యాంక్‌లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మిర్యాలగూడకు చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగలను ఓ కాగితం ముక్క పట్టించడం గమనార్హం. కాగితంలోని ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితులను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. బ్యాంక్ నుంచి మొత్తం రూ. 85 లక్షలను దొంగిలించిన నిందితులు దాచేపల్లి శ్మశానంలో రూ. 45 లక్షల డబ్బును పాతి పెట్టారు. అలాగే ఓ దొంగ ఇంట్లో […]

Update: 2020-11-26 21:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా నడికుడి స్టేట్‌ బ్యాంక్‌లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మిర్యాలగూడకు చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగలను ఓ కాగితం ముక్క పట్టించడం గమనార్హం. కాగితంలోని ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితులను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. బ్యాంక్ నుంచి మొత్తం రూ. 85 లక్షలను దొంగిలించిన నిందితులు దాచేపల్లి శ్మశానంలో రూ. 45 లక్షల డబ్బును పాతి పెట్టారు. అలాగే ఓ దొంగ ఇంట్లో రూ. 16 లక్షలు, మరో దొంగ ఇంటి ఎదురుగా ఉన్న గుట్టలో రూ. 15 లక్షలు దాచిపెట్టారు. నిందితుల ఆచూకీ తెలుసుకున్న పోలీసులు దొంగిలించిన సొమ్మును స్వాధీనం చేసుకొని.. వారిని అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News