‘గ్రేటర్’కు భద్రత కట్టుదిట్టం

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. 150 డివిజన్లలో కొనసాగే ఈ పోలింగ్ కు సుమారు 30 వేల మంది పోలీస్ ఫోర్స్ ను వినియోగిస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లు ఇప్పటికే భద్రతపరమైన చర్యలు తీసుకుంటున్నాయి. చెక్ పోస్టులు, స్టాటికల్ సర్వైలైన్స్ బృందాలు, ఫ్లైయింగ్ స్క్వాడ్స్ తదితర ఎన్నికల ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. దిశ, క్రైమ్ బ్యూరో: గ్రేటర్ వ్యాప్తంగా 150 డివిజన్లలో […]

Update: 2020-11-22 22:53 GMT

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. 150 డివిజన్లలో కొనసాగే ఈ పోలింగ్ కు సుమారు 30 వేల మంది పోలీస్ ఫోర్స్ ను వినియోగిస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లు ఇప్పటికే భద్రతపరమైన చర్యలు తీసుకుంటున్నాయి. చెక్ పోస్టులు, స్టాటికల్ సర్వైలైన్స్ బృందాలు, ఫ్లైయింగ్ స్క్వాడ్స్ తదితర ఎన్నికల ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి.

దిశ, క్రైమ్ బ్యూరో: గ్రేటర్ వ్యాప్తంగా 150 డివిజన్లలో 9101 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 7 వేల పోలింగ్ కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల సంఖ్య 2 వేలకు పైగా పెరిగాయి. 74 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. సైబరాబాద్ లో 20.50 లక్షల ఓటర్లు, రాచకొండలో 14.20 లక్షల ఓటర్లు ఉండగా, మిగతావి హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 2567 పోలింగ్ కేంద్రాలలో 770 సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 1637 పోలింగ్ కేంద్రాలలో 565 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నాయి.

ఈ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో పోలీసులు ప్రత్యేక నిఘాను ఉంచుతున్నారు. 30 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి జియో ట్యాగింగ్ ను అనుసంధానం చేయనున్నారు. ఇది ఆ కేంద్రాలలో ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ చేసేందుకు దోహదపడుతుంది. సైబరాబాద్ లో 11 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 11 స్టాటిక్ సర్వైలైన్స్ బృందాలు, రాచకొండ పరిధిలో 6 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 6 స్టాటిక్ సర్వేలైన్స్ బృందాలను పోలీస్ కమిషనర్లు నియామకం చేశారు. ఈ ప్రాంతాల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు లిక్కర్, డబ్బు పంపిణీ లాంటి కార్యక్రమాలను నిషేధించడానికి ప్రత్యేక నిఘా పెట్టారు.

4021 లైసెన్స్డ్ ఆయుధాలు డిపాజిట్..

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో వీఐపీల వద్ద విధులు నిర్వహించే గన్ మెన్లు, బ్యాంకుల్లో పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది మినహా ఆయుధాలను అనుమతి పొందిన వారంతా పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేయాలని పోలీస్ కమిషనర్లు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పటివరకు 4021 ఆయుధాలు డిపాజిట్ అయినట్టుగా రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. రూ.10 లక్షల విలువైన గంజాయి, లిక్కర్‌ను పట్టుకోగా, రూ.1.35 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి వివిధ రకాల ఫిర్యాదులు 19 అందగా, ఆ ఫిర్యాదులకు కేసులు నమోదు చేశారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు ఉంటాయని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News