పేకాటలో బెంజ్‌ కారు గెలిచాడు

దిశ, వెబ్‌డెస్క్: పేకాట.. ఎంతో మంది జీవితాలను నాశనం చేసే చెడు వ్యసనం.. ఈ ఆటలో బాగుపడ్డవారు ఎంత మంది ఉన్నారో తెలియదు గానీ రోడ్డున పడ్డవారు మాత్రం లక్షల్లో ఉన్నారు. మనిషికి డబ్బు మీద ఆశ చూపిస్తూనే నష్టాన్ని కలిగించే ఈ ఆటను చాలా వరకు దేశాల్లో రద్దు చేశారు. జూదం ఆడుతున్నారన్న సమాచారం వస్తే దాడులు చేసి మరీ అరెస్ట్ చేస్తున్నారు అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కానీ, ఈ డిజిటల్ కాలంలో ఆన్‌లైన్‌ […]

Update: 2021-02-10 23:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: పేకాట.. ఎంతో మంది జీవితాలను నాశనం చేసే చెడు వ్యసనం.. ఈ ఆటలో బాగుపడ్డవారు ఎంత మంది ఉన్నారో తెలియదు గానీ రోడ్డున పడ్డవారు మాత్రం లక్షల్లో ఉన్నారు. మనిషికి డబ్బు మీద ఆశ చూపిస్తూనే నష్టాన్ని కలిగించే ఈ ఆటను చాలా వరకు దేశాల్లో రద్దు చేశారు. జూదం ఆడుతున్నారన్న సమాచారం వస్తే దాడులు చేసి మరీ అరెస్ట్ చేస్తున్నారు అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

కానీ, ఈ డిజిటల్ కాలంలో ఆన్‌లైన్‌ గేమ్స్ ఎంతగానో ప్రాచుర్యంలోకి వచ్చాయి. దీంతో పోకర్ గేమ్స్ అందులో మరింత ఆదరణ పొందాయి. ఇందులో కూడా ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నప్పటికీ.. చాలామంది వీటి వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో చాలా సంస్థలు పోకర్‌ యాప్‌లను అందుబాటులోకి తెచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖు ఆన్‌లైన్ గేమింగ్ సంస్థ పోకర్‌సైంట్‌ ప్లేయర్లను ఆకర్షించేలా అదిరిపోయే బహుమతులు ఇస్తోంది. పోకర్‌‌సైంట్‌ వీఐపీ క్లబ్‌లో అత్యధిక లాయల్టీ పాయింట్లు సాధించిన వారికి ఏకంగా మెర్సిడెస్ బెంజ్‌ను బహుమతిగా ప్రకటిస్తూ.. చాలెంజ్‌లో గెలవాలి అని షరతులు విధించింది.

ఈ క్రమంలో సాగర్ అనే ఆటగాడు గడువుకు 3 రోజుల ముందే అత్యధిక పాయింట్లు సాధించి బహుమతిని సొంతం చేసుకున్నాడు. అనంతరం ఆటగాడు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న ఆన్‌లైన్‌ గేమింగ్ సంస్థల్లో పోకర్‌సైంట్ ఒక్కటే ఖచ్చితమైన బహుమతి ఇచ్చిందని ఆనందాన్ని వ్యక్తం చేశాడు. దీంతో పోకర్‌సైంట్‌ మెర్సిడెస్ బెంజ్‌ను కోల్పోవాల్సి వచ్చింది. ఏది ఏమైన ఆన్‌లైన్‌ గేమింగ్‌లో ఏకంగా బెంజ్‌ కారు కొట్టడం విశేషమనే చెప్పాలి.

Tags:    

Similar News