విష ప్రయోగం.. 32వేల చేపలు మృత్యువాత
దిశ, మెదక్: ఫాంపాండ్ (పంటకుంట)లో విషప్రయోగం జరిగింది. దీంతో 32 వేల చేపలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన మెదక్ జిల్లా కౌండిపల్లి మండలంలో జరిగింది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో కొట్టాల పంచాయతీ పరిధిలోని లింగంపల్లి బిట్లతండాలో జవాహర్ నాయక్ పంటకుంట(ఫాంపాండ్)లో వివిధ రకాలకు చెందిన 32వేల చేపలను పెంచుతున్నాడు. రోజు అక్కడే కాపలా ఉంటున్నాడు. ఉదయం నుంచి ఒక్కొక్క చేప చనిపోతూ మధ్యాహ్నం వరకు పూర్తిగా చనిపోయాయి. ప్రస్తుతం పావు కిలో సైజ్‌లో పెరిగాయని […]
దిశ, మెదక్: ఫాంపాండ్ (పంటకుంట)లో విషప్రయోగం జరిగింది. దీంతో 32 వేల చేపలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన మెదక్ జిల్లా కౌండిపల్లి మండలంలో జరిగింది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో కొట్టాల పంచాయతీ పరిధిలోని లింగంపల్లి బిట్లతండాలో జవాహర్ నాయక్ పంటకుంట(ఫాంపాండ్)లో వివిధ రకాలకు చెందిన 32వేల చేపలను పెంచుతున్నాడు. రోజు అక్కడే కాపలా ఉంటున్నాడు. ఉదయం నుంచి ఒక్కొక్క చేప చనిపోతూ మధ్యాహ్నం వరకు పూర్తిగా చనిపోయాయి. ప్రస్తుతం పావు కిలో సైజ్‌లో పెరిగాయని బాధితుడు చెబుతున్నాడు. కావాలనే ఎవరో విష ప్రయోగం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. భారీ సంఖ్యలో చేపలు చనిపోవడంతో సుమారు రూ.10లక్షలు నష్టపోయానని తెలిపారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.
Tags : Poisonous, experiment, 32 thousand, fish die, medak, lake