‘రిక్షావాలా’కు ప్రధాని లేక
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. మన సమాజపు అట్టడుగు బతుకుజీవి రిక్షావాలాకు లేఖ రాశారు. కూతురు పెళ్లికి శుభాకాంక్షలు తెలుపుతూ రిక్షావాలా కుటుంబానికి లేఖ పంపి పెళ్లింట సంతోషాలను రెట్టింపు చేశారు. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని దొమ్రి గ్రామానికి చెందిన రిక్షా తొక్కే మంగళ్ కేవాత్.. తన కూతురు పెళ్లికి రావలసిందిగా ప్రధాని మోడీని ఆహ్వానిస్తూ మొదటి శుభలేఖను స్వయంగా వెళ్లి ప్రధాని కార్యాలయాని(పీఎంఓ)కి అందించారు. కాగా, సరిగ్గా పెళ్లినాడే(ఈ నెల 12వ తేదీ) […]
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. మన సమాజపు అట్టడుగు బతుకుజీవి రిక్షావాలాకు లేఖ రాశారు. కూతురు పెళ్లికి శుభాకాంక్షలు తెలుపుతూ రిక్షావాలా కుటుంబానికి లేఖ పంపి పెళ్లింట సంతోషాలను రెట్టింపు చేశారు. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని దొమ్రి గ్రామానికి చెందిన రిక్షా తొక్కే మంగళ్ కేవాత్.. తన కూతురు పెళ్లికి రావలసిందిగా ప్రధాని మోడీని ఆహ్వానిస్తూ మొదటి శుభలేఖను స్వయంగా వెళ్లి ప్రధాని కార్యాలయాని(పీఎంఓ)కి అందించారు. కాగా, సరిగ్గా పెళ్లినాడే(ఈ నెల 12వ తేదీ) ప్రధాని నుంచి కేవాత్ కుటుంబం లేఖ అందుకున్నది. అందులో ప్రధాని మోడీ.. రిక్షావాలా కుటుంబానికి శుభాకాంక్షలు చెబుతూ వధూ వరులను ఆశీర్వదించారు. ఈ లేఖ అందగానే పెళ్లింట సందడి ఆకాశాన్నంటింది. వధూ వరుల కుంటుంబం ఆనందంలో మునిగిపోయాయి. ప్రధాని దత్తత తీసుకున్న దొమ్రి గ్రామానికి చెందిన కేవాత్ కుటుంబం.. ఇప్పుడు ప్రధాని మోడీని కలిసి తమ బాధలు చెప్పుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్నది.