ఈ నెల 23న అసోం, బెంగాల్‌లో ప్రధాని పర్యటన

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 23న పశ్చిమబెంగాల్‌, అసోం రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ‘పరాక్రమ దివస్’ వేడుకలను పురస్కరించుకొని కోల్‌కతాను సందర్శించనున్నారు. అక్కడి నుంచి అసోం రాష్ట్రానికి వెళ్లనున్నారు. శివసాగర్ జెరెంగా పథార్‌లో 1.16 లక్షల మంది భూ పట్టాలను పంపిణీ చేయనున్నారు. కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్‌లో ‘పరాక్రమ దివస్’ ఉత్సవాల ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతారని ప్రధాన […]

Update: 2021-01-21 09:51 GMT

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 23న పశ్చిమబెంగాల్‌, అసోం రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ‘పరాక్రమ దివస్’ వేడుకలను పురస్కరించుకొని కోల్‌కతాను సందర్శించనున్నారు. అక్కడి నుంచి అసోం రాష్ట్రానికి వెళ్లనున్నారు. శివసాగర్ జెరెంగా పథార్‌లో 1.16 లక్షల మంది భూ పట్టాలను పంపిణీ చేయనున్నారు. కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్‌లో ‘పరాక్రమ దివస్’ ఉత్సవాల ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతారని ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. స్వాతంత్ర్య సంగ్రామంలో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ పాత్ర అనిర్వచనీయమైనది. ఆయన నిస్వార్థ త్యాగాన్ని, అసమాన స్ఫూర్తిని స్మరించుకుంటూ ప్రతి ఏడాది జనవరి 23న నేతాజీ జయంతి సందర్భంగా ‘పరాక్రమ దివస్’ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సందర్భంగా కోల్‌కతాలో శాశ్వతమైన ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించనున్నారు. ఆయన స్మారకార్థం నాణేంతోపాటు పోస్టల్ స్టాంపును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విడుదల చేయనున్నారు.

Tags:    

Similar News