జీ7 సదస్సులో పాల్గొననున్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: యూకే పీఎం బోరిస్ జాన్సన్ ఆహ్వానం మేరకు మనదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 12వ, 13వ తేదీల్లో జీ7 సదస్సులో పాల్గొనబోతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. 7 దేశాల అగ్రనేతలతో ఈ నెల 12న యూకేలో జీ7 సదస్సు మొదలుకాబోతున్నది. దీనికి భారత్ సహా ఆస్ట్రేలియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, దక్షిణాఫ్రికాలను అతిథి దేశాలుగా యూకే ఆహ్వానించింది. కరోనానంతరం ఆర్థిక, వాణిజ్య, పర్యావరణ మార్పు నియంత్రణ, పరస్పర సహకారాలు ప్రధానాంశాలుగా […]

Update: 2021-06-10 12:04 GMT

న్యూఢిల్లీ: యూకే పీఎం బోరిస్ జాన్సన్ ఆహ్వానం మేరకు మనదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 12వ, 13వ తేదీల్లో జీ7 సదస్సులో పాల్గొనబోతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. 7 దేశాల అగ్రనేతలతో ఈ నెల 12న యూకేలో జీ7 సదస్సు మొదలుకాబోతున్నది. దీనికి భారత్ సహా ఆస్ట్రేలియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, దక్షిణాఫ్రికాలను అతిథి దేశాలుగా యూకే ఆహ్వానించింది. కరోనానంతరం ఆర్థిక, వాణిజ్య, పర్యావరణ మార్పు నియంత్రణ, పరస్పర సహకారాలు ప్రధానాంశాలుగా ఈ సదస్సు జరగనుంది. 2019లోనూ ఫ్రెంచ్ ప్రెసిడెన్సీ ఆహ్వానం మేరకు భారత ప్రధాని జీ7 సదస్సులో పాల్గొన్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News