కరోనా.. కులం, మతం, జాతిని చూడదు : ప్రధాని
న్యూఢిల్లీ: కరోనా అందరినీ సమానంగా నష్టపరుస్తుంది. వైరస్ సోకేముందు సదరు వ్యక్తి కులం, మతం, వర్ణం, జాతి, భాష, ప్రాంతాలను పట్టించుకోదని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. అందుకే మనమంతా సోదరాభావాన్ని కలిగి ఉండాలని ఐక్యంగా పోరాడాలని తెలిపారు. ఈ పోరాటంలో మనందరిదంతా ఒక్కటే జట్టు అని పేర్కొన్నారు. గతంలోనైతే దేశాలు లేదా కొన్ని సమాజాలు ఇతర సమాజాలపై ఎదురుపడి యుద్ధాలు చేసుకునేవి.. కానీ, ఈ రోజు మనమంతా ఒకే సవాల్‌ను ఎదుర్కొంటున్నాం. భవిష్యత్తు అంతా మన […]
న్యూఢిల్లీ: కరోనా అందరినీ సమానంగా నష్టపరుస్తుంది. వైరస్ సోకేముందు సదరు వ్యక్తి కులం, మతం, వర్ణం, జాతి, భాష, ప్రాంతాలను పట్టించుకోదని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. అందుకే మనమంతా సోదరాభావాన్ని కలిగి ఉండాలని ఐక్యంగా పోరాడాలని తెలిపారు. ఈ పోరాటంలో మనందరిదంతా ఒక్కటే జట్టు అని పేర్కొన్నారు. గతంలోనైతే దేశాలు లేదా కొన్ని సమాజాలు ఇతర సమాజాలపై ఎదురుపడి యుద్ధాలు చేసుకునేవి.. కానీ, ఈ రోజు మనమంతా ఒకే సవాల్‌ను ఎదుర్కొంటున్నాం. భవిష్యత్తు అంతా మన సమైక్యతకు సంబంధించినదేనని ఆయన లింక్డిన్‌లో పోస్టు చేశారు. ఇప్పుడు భారత్ నుంచి వెలువడే పెద్ద పెద్ద ఆలోచనలు, దృక్పథాలు ప్రపంచ ప్రాసంగికతను కలిగి ఉండాలని, ప్రపంచ అవసరాలకు సరిపడేలా ఉండాలని సూచించారు. కొవిడ్ 19 విలయం తర్వాత ప్రపంచంలో మల్టినేషనల్ సప్లై చైన్‌లో భారత్ కీలక భూమిక పోషించే అవకాశమున్నదని తెలిపారు. అందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు.
కరోనా కాలంలో.. డిజిటల్ వేగం :
కరోనావైరస్.. మన ప్రొఫెషనల్ జీవితాల్లో బలమైన ప్రభావాన్ని వేస్తున్నది. ఈ రోజుల్లో ఇల్లే మన కొత్త ఆఫీస్‌గా, ఇంటర్నెట్.. కొత్త మీటింగ్ రూమ్‌గా మారిందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ మార్పులను తాను స్వీకరిస్తున్నట్టు తెలిపారు. సహమంత్రులు, అధికారులు, ప్రపంచనేతలతోనైనా ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌లోనే చర్చిస్తున్నారని వివరించారు. ఈ కాలంలో ప్రజలు వారి ఆఫీసు పనులను ఎలా కొనసాగిస్తున్నారో.. స్టేయింగ్ హోమ్ పై అవగాహన కోసం ఫిలిం స్టార్‌లు… సృజనాత్మకంగా తీస్తున్న వీడియోలు కనిపిస్తూనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మన సింగర్లు.. ఆన్‌లైన్‌లో కాన్సర్ట్‌లు నిర్వహిస్తున్నారని, చెస్ కూడా డిజిటల్ టెక్ సహాయంతో ఆడుతున్నారని వివరించారు. వర్క్ ప్లేస్.. డిజిటల్‌గా మారిపోతున్నదని, అయితే, ఈ సాంకేతిక మార్పులు పేదల జీవితాల్లోనే ప్రధానంగా ప్రభావం చూపిస్తుందని తెలిపారు. ఈ టెక్నాలజీనే ఉద్యోగస్వామ్యంలోని అంచెలను, దళారీలను తొలగిస్తుందని, సంక్షేమ చర్యలను వేగం చేస్తుందని వివరించారు.
tags: pm modi, covid 19, togetherness, no caste, religion, race, equally affects