ఒక్క రూపాయి వద్దు.. అందరికీ ఉచితంగా వ్యాక్సిన్: మోడీ
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ గుడ్ న్యూస్ చెప్పారు. వంద శాతం వ్యాక్సినేషన్ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే ఆయన ప్రకటించారు. సోమవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని.. 75 శాతం వ్యాక్సిన్‌ను కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలకు ఇస్తోందని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రాల చేతిలో ఉన్న 25 శాతం బాధ్యత కూడా కేంద్రమే తీసుకుంటుందన్నారు. జూన్ 21 నుంచి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఫ్రీగా వ్యాక్సిన్ అందజేస్తామన్నారు. […]
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ గుడ్ న్యూస్ చెప్పారు. వంద శాతం వ్యాక్సినేషన్ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే ఆయన ప్రకటించారు. సోమవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని.. 75 శాతం వ్యాక్సిన్‌ను కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలకు ఇస్తోందని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రాల చేతిలో ఉన్న 25 శాతం బాధ్యత కూడా కేంద్రమే తీసుకుంటుందన్నారు. జూన్ 21 నుంచి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఫ్రీగా వ్యాక్సిన్ అందజేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్‌పై ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని.. కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి మరీ రాష్ట్రాలకు పంపిణీ చేస్తోందని ప్రధాని మోడీ వెల్లడించారు.
కరోనా సెకండ్ వేవ్‌తో భారత్ పోరాడుతోందని.. ఈ పోరాటంలో ఎంతో మంది సన్నిహితులను కోల్పోయామని ప్రధాని నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన 100 ఏళ్లలో ఇటువంటి మహమ్మారిని చూడలేదన్నారు. కొవిడ్‌తో పోరాడుతూనే దేశంలో పటిష్టమైన వైద్య వ్యవస్థను రూపొందించుకున్నామని.. ఇదే సమయంలో భారీగా ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్నట్టు ఆయన గుర్తు చేశారు. విదేశాల నుంచి మందులు, ఆక్సిజన్, తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. గతంలో పోలియో, హైపటైటిస్ బీ కోసం కూడా ఏళ్ల తరబడి వేచి చూశామన్నారు.
కానీ, కరోనా సమయంలో ఏడాదిలోనే రెండు మేడిన్ ఇండియా వ్యాక్సిన్లు రూపొందించామని.. వ్యాక్సిన్‌లను తయారు చేసే కంపెనీలకు అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ఇప్పటికే 23 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చామని.. యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని మోడీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం భారత్‌లో 7 వ్యాక్సిన్ కంపెనీలు తయారీలో నిమగ్నమయ్యాయని.. ఇందులో మూడు వ్యాక్సిన్లు తయారీలో దశలో ఉన్నాయన్నారు.
ఇదే సమయంలో విదేశాల నుంచి వ్యాక్సిన్లు తీసుకొచ్చే కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నట్టు మోడీ తెలిపారు. ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్ కోసం కూడా రీసెర్చ్ జరుగుతోందన్నారు. కరోనా సెకండ్ వేవ్‌కు ముందు ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇచ్చి ఉండకపోతే.. సెకండ్ వేవ్‌లో దారుణ పరిస్థితులు ఎదుర్కొవాల్సి ఉండేదని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇంత చేస్తున్న మీడియాలో ఓ వర్గం మాత్రం అసత్య ప్రచారం చేసిందని మోడీ మండిపడ్డారు.