చినుకు పడితే పట్నం చిత్తడి

దిశ, ఇబ్రహీంపట్నం, (ఆగస్టు 30 ) : ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఇబ్రహీంపట్నం రోడ్లన్ని బురద మయంగా మారాయి. కాలు తీసి కాలు వేయలేని దుస్థితి నెలకొంది. ఇంకా ఎన్నాళ్లు ఈ కష్టాలు పడాలంటూ స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని బృందావన్‌ కాలనీ, గోకుల్‌నగర్, వినాయకనగర్, అంబేద్కర్‌నగర్, వెంకటరమణ కాలని, పద్మశాలి కాలనీ, శిరిడిసాయి నగర్, శాలివాహన నగర్, పలు వార్డుల్లో రోడ్ల పరిస్థితి ఇదే విధంగా కనిపిస్తోంది. ఒకపక్క మిషన్ భగీరథ పైపుల నిర్మాణం […]

Update: 2021-08-30 06:41 GMT

దిశ, ఇబ్రహీంపట్నం, (ఆగస్టు 30 ) : ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఇబ్రహీంపట్నం రోడ్లన్ని బురద మయంగా మారాయి. కాలు తీసి కాలు వేయలేని దుస్థితి నెలకొంది. ఇంకా ఎన్నాళ్లు ఈ కష్టాలు పడాలంటూ స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని బృందావన్‌ కాలనీ, గోకుల్‌నగర్, వినాయకనగర్, అంబేద్కర్‌నగర్, వెంకటరమణ కాలని, పద్మశాలి కాలనీ, శిరిడిసాయి నగర్, శాలివాహన నగర్, పలు వార్డుల్లో రోడ్ల పరిస్థితి ఇదే విధంగా కనిపిస్తోంది.

ఒకపక్క మిషన్ భగీరథ పైపుల నిర్మాణం కోసం, రోడ్లను తవ్వి వదిలేయటం, కాల్వలలో అక్కడక్కడ చెత్త చెదారం పేరుకుపోయి వరద నీరు నిలిచి ఉంటుందని, దాని వల్లే రోడ్లన్నీ బురద మయంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ పైప్ లైన్ల నిర్మాణం కోసం తీసిన గోతులను వెంటనే పూర్తి చేసి, రోడ్లను పునరుద్ధరించాలని సంబంధిత పట్టణ పాలకవర్గం, అధికారులను పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News