ప్రాణాలతో చెలగాటం.. అంగన్వాడీ విద్యార్థులకు ‘ప్లాస్టిక్’ బియ్యం

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని కర్నూలు జిల్లాలో ప్లాస్టిక్ బియ్యం కలకలం సృష్టించింది. కొందరు అక్రమార్కులతో చేతులు కలిపిన అధికారులు కౌతాలంలోని హైస్కూల్, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు ప్లాస్టిక్ బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయాన్ని అంగన్ వాడీ నిర్వాహకులు గుర్తించారు. అనంతరం ఎంఈవో దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన కర్నూల్ ఎంఈవో ప్లాస్టిక్ బియ్యాన్ని వెనక్కి పంపుతామని ప్రకటించారు. అంతేకాకుండా ప్లాస్టిక్ బియ్యాన్ని పంపిణీ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న […]

Update: 2021-08-06 11:06 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని కర్నూలు జిల్లాలో ప్లాస్టిక్ బియ్యం కలకలం సృష్టించింది. కొందరు అక్రమార్కులతో చేతులు కలిపిన అధికారులు కౌతాలంలోని హైస్కూల్, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు ప్లాస్టిక్ బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయాన్ని అంగన్ వాడీ నిర్వాహకులు గుర్తించారు.

అనంతరం ఎంఈవో దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన కర్నూల్ ఎంఈవో ప్లాస్టిక్ బియ్యాన్ని వెనక్కి పంపుతామని ప్రకటించారు. అంతేకాకుండా ప్లాస్టిక్ బియ్యాన్ని పంపిణీ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న వారిపై కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News