మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలి
దిశ, భువనగిరి రూరల్ : మొక్కలు నాటడం ప్రతీ ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని జడ్పీటీసీ గోలీ ప్రణీత పింగల్ రెడ్డి అన్నారు. నాలుగోవిడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా బీబీనగర్ పట్టణంలోని ప్రతి ఇంటికి 6 మొక్కలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మానవ మనుగడకు చెట్ల అవసరమైన వనరని, మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించినప్పుడే భావితరాలకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించగలిగనవారమవుతామన్నారు. అంతేకాకుండా పిల్లలకు చిన్నప్పటినుండే మొక్కలు పెంచేవిధంగా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో […]
దిశ, భువనగిరి రూరల్ : మొక్కలు నాటడం ప్రతీ ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని జడ్పీటీసీ గోలీ ప్రణీత పింగల్ రెడ్డి అన్నారు. నాలుగోవిడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా బీబీనగర్ పట్టణంలోని ప్రతి ఇంటికి 6 మొక్కలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మానవ మనుగడకు చెట్ల అవసరమైన వనరని, మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించినప్పుడే భావితరాలకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించగలిగనవారమవుతామన్నారు.
అంతేకాకుండా పిల్లలకు చిన్నప్పటినుండే మొక్కలు పెంచేవిధంగా అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట జిల్లా బీబీనగర్ సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మి శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి పింగల్ రెడ్డి, ఆర్యవైశ్య సంఘము జిల్లా అధ్యక్షులు మల్లగారి శ్రీనివాస్, ఉపసర్పంచ్ ఎండీ దస్తగిరి, వార్డు సభ్యులు అంజి పొట్ట, బెండ ప్రవీణ్, శ్యామల వేణు, రొడ్డ యమున తదితరులు పాల్గొన్నారు.