మావోల ఎత్తులు.. పోలీసుల పైఎత్తులు

దిశ ప్రతినిధి, కరీంనగర్: అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని మావోయిస్టుల చర్యలను పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. చత్తీస్ గడ్ దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోల ఎత్తులకు పోలీసులు పైఎత్తు వేస్తున్నారు. సమాంతర ప్రభుత్వం నడుపుతున్న బస్తర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతరలు సిద్ధం చేసుకోగా పోలీసు బలగాలు నిర్వీర్యం చేశాయి. బీజాపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు 40 కిలోల ఐఈడీడీ మందుగుండును భూమిలో అమర్చగా ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు బయటకు తీసి నిర్వీర్యం చేశారు. […]

Update: 2020-07-26 02:08 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని మావోయిస్టుల చర్యలను పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. చత్తీస్ గడ్ దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోల ఎత్తులకు పోలీసులు పైఎత్తు వేస్తున్నారు. సమాంతర ప్రభుత్వం నడుపుతున్న బస్తర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతరలు సిద్ధం చేసుకోగా పోలీసు బలగాలు నిర్వీర్యం చేశాయి. బీజాపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు 40 కిలోల ఐఈడీడీ మందుగుండును భూమిలో అమర్చగా ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు బయటకు తీసి నిర్వీర్యం చేశారు.

మరోవైపున అమరవీరుల సంస్మరణ కోసం ఏర్పాటు చేసిన స్మారక స్థూపాలను కూడా పోలీసులు కూల్చి వేశారు. బస్తర్ అటవీ ప్రాంతంలోని ఉస్సోరి, హోర్నకల్, టిండోడి, బిరియా భూమి తదితర అటవీ గ్రామాల్లో మావోలు నిర్మించిన స్మారక స్థూపాలను భైరంగఢ్ ఏరియాకు చెందిన 222 డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డ్స్ (డీఆర్జీ) కూల్చివేశాయి. మావోయిస్టులను ఏరి వేసేందుకు డీఆర్జీ బలగాలు పెద్ద ఎత్తున దండకారణ్య అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తూ స్థూపాలను, మందుపాతరాలను తొలగిస్తూ ముందుకు సాగుతున్నాయి.

Tags:    

Similar News