గుడ్‌న్యూస్: హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు!

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ మ్యాచ్‌లకు హైదరాబాద్‌ను ఎంపిక చేయకపోవడంతో తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులు, ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో బీసీసీఐని కోరినా.. హైదరాబాద్‌ను ఎంపిక చేయకపోవడంపై విమర్శలొచ్చాయి. అయితే ఇప్పుడు చివరికి హైదరాబాద్‌లోనే ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తోంది. ముంబైలో కరోనా కేసులు పెరుగుతుండటం, రాత్రి కర్ఫ్యూ విధించడం, వాంఖడే స్టేడియంలో పది మంది గ్రౌండ్ స్టాఫ్‌కు కరోనా సోకడంతో స్టాండ్ బై వేదికగా […]

Update: 2021-04-03 06:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ మ్యాచ్‌లకు హైదరాబాద్‌ను ఎంపిక చేయకపోవడంతో తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులు, ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో బీసీసీఐని కోరినా.. హైదరాబాద్‌ను ఎంపిక చేయకపోవడంపై విమర్శలొచ్చాయి. అయితే ఇప్పుడు చివరికి హైదరాబాద్‌లోనే ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తోంది.

ముంబైలో కరోనా కేసులు పెరుగుతుండటం, రాత్రి కర్ఫ్యూ విధించడం, వాంఖడే స్టేడియంలో పది మంది గ్రౌండ్ స్టాఫ్‌కు కరోనా సోకడంతో స్టాండ్ బై వేదికగా హైదరాబాద్‌ను బీసీసీఐ కన్ఫామ్ చేసింది. ముంబైలో జరిగే మ్యాచ్‌లను హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది.

దీంతో తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. చివరికి మంత్రి కేటీఆర్ కోరిక తీరినట్లేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏప్రిల్ 9న చెన్నైలో ముంబై ఇండియన్స్, బెంగళూరు మధ్య ఫస్ట్ మ్యాచ్ జరగనుండగా.. రెండో మ్యాచ్ 10న చెన్నై, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ముంబైలో జరగాల్సి ఉంది.

Tags:    

Similar News