కేరళ రిజల్ట్: చరిత్ర తిరగరాసిన లెఫ్ట్ ఫ్రంట్!
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా కేరళలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనట్టుగా కేరళ ప్రజలు ఆసక్తికర ఫలితం ఇస్తున్నారు. గతంలో ఎప్పుడైనా ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీకి రెండోసారి ఆ రాష్ట్ర ప్రజలు ఎన్నడూ అవకాశం ఇవ్వలేదు. కానీ, ఈ సారి చరిత్ర తిరగరాసేలా రెండోసారి ఎల్డీఎఫ్‌కు కేరళ ప్రజలు పట్టం కట్టారు. అందులో భాగంగానే స్పష్టమైన […]
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా కేరళలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనట్టుగా కేరళ ప్రజలు ఆసక్తికర ఫలితం ఇస్తున్నారు. గతంలో ఎప్పుడైనా ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీకి రెండోసారి ఆ రాష్ట్ర ప్రజలు ఎన్నడూ అవకాశం ఇవ్వలేదు. కానీ, ఈ సారి చరిత్ర తిరగరాసేలా రెండోసారి ఎల్డీఎఫ్‌కు కేరళ ప్రజలు పట్టం కట్టారు. అందులో భాగంగానే స్పష్టమైన ఆధిక్యం ఇస్తూ.. కేరళ ఓటర్లు వినూత్నంగా నిర్ణయం వెల్లడించారు.
కేరళ అసెంబ్లీలో మొత్తం 140 సీట్లు ఉన్నాయి. అధికారం దక్కాలంటే 71 సీట్లు కావాలి. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ 97 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, యూడీఎఫ్ 42 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీలో ఒక స్థానంలో ఖాతా తెరిచేలా పరిస్థితులు కనబడుతున్నాయి. అంతేగాకుండా.. కేరళ సీఎం పినరయి విజయన్ ధర్మాదాంలో భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి మెట్రోమ్యాన్ శ్రీధరన్ సైతం పాలక్కడ్‌లో పూర్తి ఆధిక్యంతో దూసుకెళ్తున్నాడు.