వ్యాక్సిన్: బాంబే హైకోర్టులో పిల్

ముంబయి: కరోనా వ్యాక్సిన్‌పై ఫార్మా సంస్థలు ప్రకటిస్తు్న్న ధరలు వ్యవస్థీకృత దోపిడి వంటివని, వాటిని అదుపు చేయాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ బాంబే హైకోర్టులో పిల్ దాఖలైంది. ముంబయికి చెందిన న్యాయవాది ఫైజన్ ఖాన్, ముగ్గురు లా స్టూడెంట్స్ కలిసి ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. కరోనా వ్యాక్సిన్ (కొవిషీల్డ్, కొవాగ్జిన్) ను తయారుచేస్తున్న ఫార్మా సంస్థలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకేవిధమైన ధరలను అందించేవిధంగా కేంద్రాన్ని ఆదేశించాలని పిల్‌లో కోరారు. వ్యాక్సిన్‌ […]

Update: 2021-04-28 07:53 GMT

ముంబయి: కరోనా వ్యాక్సిన్‌పై ఫార్మా సంస్థలు ప్రకటిస్తు్న్న ధరలు వ్యవస్థీకృత దోపిడి వంటివని, వాటిని అదుపు చేయాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ బాంబే హైకోర్టులో పిల్ దాఖలైంది. ముంబయికి చెందిన న్యాయవాది ఫైజన్ ఖాన్, ముగ్గురు లా స్టూడెంట్స్ కలిసి ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. కరోనా వ్యాక్సిన్ (కొవిషీల్డ్, కొవాగ్జిన్) ను తయారుచేస్తున్న ఫార్మా సంస్థలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకేవిధమైన ధరలను అందించేవిధంగా కేంద్రాన్ని ఆదేశించాలని పిల్‌లో కోరారు.

వ్యాక్సిన్‌ ధరను రూ. 150 కు అందజేయాలని అందులో పేర్కొన్నారు. ఫార్మా సంస్థలు కొవిడ్ మరణాలతో జనాల్లో భయాందోళనలను సృష్టి్స్తున్నాయని ఆరోపించారు. దేశం సంక్షోభ కాలంలో ఉన్న ఈ సమయంలో వ్యా్క్సిన్ ధరలను అదుపుచేసి, ఫార్మా సంస్థల బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు తెరదించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని పిల్‌లో కోరారు. హైకోర్టు దీనిపై ఈవారంలోనే విచారణ చేపట్టే అవకాశం ఉంది.

Tags:    

Similar News