మంత్రి సబిత సభలో పిక్ పాకెట్ గ్యాంగ్ హల్‌చల్..

దిశ, పరిగి : సభలు, సమావేశాలు జరిగే ప్రదేశాల్లో నాయకులు, అధికారుల్లో కలిసి పోయి పిక్ పాకెట్ దొంగతనాలు చేసే గ్యాంగ్‌ను పరిగి పోలీసులు పట్టుకున్నారు. పరిగిలో శనివారం మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి తదితరుల హాజరయ్యారు. ఈ సమావేశానికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. సమావేశంలో కలిసి పోయి దొంగతనం చేయాలనుకున్నారు. అనుమానంగా కనిపించడంతో పోలీసులు వారిపై ఓ కన్నేసి ఉంచారు. ఇది గమనించిన […]

Update: 2021-08-14 10:47 GMT

దిశ, పరిగి : సభలు, సమావేశాలు జరిగే ప్రదేశాల్లో నాయకులు, అధికారుల్లో కలిసి పోయి పిక్ పాకెట్ దొంగతనాలు చేసే గ్యాంగ్‌ను పరిగి పోలీసులు పట్టుకున్నారు. పరిగిలో శనివారం మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి తదితరుల హాజరయ్యారు. ఈ సమావేశానికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. సమావేశంలో కలిసి పోయి దొంగతనం చేయాలనుకున్నారు.

అనుమానంగా కనిపించడంతో పోలీసులు వారిపై ఓ కన్నేసి ఉంచారు. ఇది గమనించిన పిక్ పాకెట్ గ్యాంగ్ తాము తెచ్చుకున్న వాహనాల్లో అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే పోలీసులు వారిని ఫాలో చేశారు. పరిగి నుంచి మహబూబ్‌నగర్ రూట్లో వారిని వెంబడించి పట్టుకున్నట్లు సమాచారం. అలాగే పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల్లో ఈ గ్యాంగ్ దొంగతనాలు చేస్తూ ప్రజలను దోచుకునే వారిని పోలీసులు తెలిపారు. ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.

Tags:    

Similar News