కస్టమర్లకు షాకిచ్చిన ఫొటోగ్రాఫర్లు.. డెడ్ లైన్ 90 రోజులే..
దిశ, వెబ్‌డెస్క్ : ఎన్నో మధుర స్మృతులు, జ్ఞాపకాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఫొటో నిలుస్తోంది. అమ్మ బొడ్డు తెంచుకుని పుట్టిన నాటి నుంచి కాటికి వెళ్లే వరకు మన రూపాన్ని పదిల పరుస్తోంది ఫొటో. ఇలాంటి ఫొటోలు నాటి తరం నుంచి నేటి తరం వరకు ఏ చిన్న ఫంక్షన్ జరిగినా తీయించుకుంటున్నారు. దీంతో చాలా మంది నిరుద్యోగులు ఫొటోగ్రఫీని జీవనోపాధిగా మార్చుకుని జీవిస్తున్నారు. స్టూడియోలను నెలకొల్పుకుని ఉపాధి పొందుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. అసలు సమస్య […]
దిశ, వెబ్‌డెస్క్ : ఎన్నో మధుర స్మృతులు, జ్ఞాపకాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఫొటో నిలుస్తోంది. అమ్మ బొడ్డు తెంచుకుని పుట్టిన నాటి నుంచి కాటికి వెళ్లే వరకు మన రూపాన్ని పదిల పరుస్తోంది ఫొటో. ఇలాంటి ఫొటోలు నాటి తరం నుంచి నేటి తరం వరకు ఏ చిన్న ఫంక్షన్ జరిగినా తీయించుకుంటున్నారు. దీంతో చాలా మంది నిరుద్యోగులు ఫొటోగ్రఫీని జీవనోపాధిగా మార్చుకుని జీవిస్తున్నారు. స్టూడియోలను నెలకొల్పుకుని ఉపాధి పొందుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. అసలు సమస్య ఫంక్షన్లు అయిపోయిన తర్వాతనే ప్రారంభమవుతోంది.
ఫొటో గ్రాఫర్లు లక్షల రూపాయల విలువైన కెమెరాలు, డ్రోన్లు, ఓ ఐదారుగురు కలిసి పని చేస్తేనే ఓ శుభకార్యం ఫొటోలు, వీడియోలు తీయడం సాధ్యం అవుతుంది. అయితే కస్టమర్లు ప్రొగ్రాంకు ముందు కొంత అడ్వాన్స్ చెల్లించి షూటింగ్ చేయించుకుంటారు. ఫంక్షన్ అయిపోయాక మళ్లీ వాటి గురించి అంతగా పట్టించుకోరు. ఫొటో గ్రాఫర్ గుర్తు చేసినా.. అప్పుడు, ఇప్పుడు అంటూ కాలం వెళ్లదీస్తూ ఉంటారు. ఆ తర్వాత రెండు, మూడేళ్లకు వచ్చి తమ ఫొటోలు, వీడియోలు ఇవ్వాలని కోరుతుంటారు.
అయితే ప్రస్తుతం అంతా డిజిటల్‌మయం కావడంతో అన్ని రోజులు వాటిని భద్రపర్చడం ఫొటోగ్రాఫర్లకు కష్టం అవుతుంది. దీంతో కస్టమర్లు గొడవలకు దిగుతున్నారు. వీటిన్నీటికి పరిష్కారంగా వికారాబాద్ జిల్లా ఫొటో, వీడియో గ్రాఫర్ల సంఘం ఓ నిర్ణయానికి వచ్చింది. ఫంక్షన్ తీసిన 90 రోజుల్లోపు కస్టమర్లు తమ ఫొటోలు, వీడియోలు తీసుకెళ్లాలని లేనిపక్షంలో తనకు సంబంధం లేదని తీర్మానం చేశారు. 90 రోజుల వరకే తాము బాధ్యత వహిస్తామని, ఆ తర్వాత ఫొటోలు, వీడియోలు పాడైపోయినా.. తమకు సంబంధం లేదని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ నిర్ణయం కస్టమర్లకు షాక్ ఇచ్చేలా ఉన్నది. అయితే స్టూడియోల్లో గుట్టలుగా పేరుకుపోతున్న ఆల్బమ్‌లను క్లియర్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని ఫొటో గ్రాఫర్లు వివరిస్తున్నారు.