నాలుగేళ్లుగా నిలిపివేత.. ఈ సారైనా ఉంటాయా?
దిశ ప్రతినిధి,హైదరాబాద్: వైద్య ఆరోగ్య శా ఖలో పని చేస్తున్న పీహెచ్ఎన్ నర్సులను పదోన్నతుల ప్రక్రియ మానసిక ఆందోళనలకు గురి చేస్తోంది. వీరి పదోన్నతులకు సంబంధించిన ఫైలు అడ్ హక్ రూల్స్ దొరకడం లేదనే కారణంగా సుమారు నాలుగు సంవత్సరాలుగా సీఎం పేషిలో పెండింగ్ లో ఉంది. దీంతో పదోన్నతులకు అర్హత ఉన్నా ఎలాంటి ప్రమోషన్లు లేకుండానే వారు పదవీ విరమణ చేస్తున్నారు. ఇలా ఫైలు పెండింగ్ లో ఉన్న నాలుగేళ్లలో 52 మంది పీహెచ్ఎన్ లు […]
దిశ ప్రతినిధి,హైదరాబాద్: వైద్య ఆరోగ్య శా ఖలో పని చేస్తున్న పీహెచ్ఎన్ నర్సులను పదోన్నతుల ప్రక్రియ మానసిక ఆందోళనలకు గురి చేస్తోంది. వీరి పదోన్నతులకు సంబంధించిన ఫైలు అడ్ హక్ రూల్స్ దొరకడం లేదనే కారణంగా సుమారు నాలుగు సంవత్సరాలుగా సీఎం పేషిలో పెండింగ్ లో ఉంది. దీంతో పదోన్నతులకు అర్హత ఉన్నా ఎలాంటి ప్రమోషన్లు లేకుండానే వారు పదవీ విరమణ చేస్తున్నారు. ఇలా ఫైలు పెండింగ్ లో ఉన్న నాలుగేళ్లలో 52 మంది పీహెచ్ఎన్ లు ప న్నతులు లేకుండానే పదవీ విరమణ చేశారు. శాఖలో తాజాగా మరో 120 మంది పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ అన్ని శాఖలలో పదోన్నతులు ఇచ్చే విషయంలో చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ మా ఫైలు ముందుకు కదలడం లేదని పబ్లిక్ హెల్త్ నర్సులు ఆందోళన చెందుతున్నారు.
కలిసే అవకాశం కల్పించాలి..
రాష్ట్రంలో పని చేస్తున్న ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేయాలని, అర్హులైన వారికి పదోన్నతులు ఇవ్వాలని ఇటీవల ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు సీఎస్ సోమేష్ కుమార్ ను కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 70 శాతం ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియ పూర్తైందని చెప్పారని, అందులో పీహెచ్ఎన్‌లు లేకపోవడం తమకు ఆందోళనకు గురి చేస్తోందని వారు వాపోతున్నారు. కేవల అడహక్ ఫైలు దొర కడం లేదనే కారణంగా ఏళ్ల తరబడి న్యాయంగా పదోన్నతులు రావలసిన వారికి ఇవ్వకుండా కాలయాపన చేస్తారా అని మండిపడుతున్నారు. ఈ విషయమై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేం దర్ తోపాటు సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శిని కూడా కలిసి పలుమార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని పీహెచ్ఎన్ లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదోన్నతులను వెంటనే ఇవ్వాలని ఈ నెల 20వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేషిలో మరో లేఖను కూడా అందజేశారు. ఈ నేపథ్యంలో తాము నేరుగా సీఎం కేసీఆర్ ను కలిసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సంబంధించిన ఫైలు ముందుకు సాగలేదు. 2017 నుంచి అర్హత ఉన్నప్పటికీ పదోన్నతులు రాకుండా పదవీ విరమణ చేసిన వారిని కూడా చేర్చి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
చెప్పులరిగేలా తిరుగుతున్నాం
మెడికల్ అండ్ హెల్త్ అండ్ ఫ్యామిలి వెల్ఫేర్ ఈఎస్ఐ (ఐఎంఎస్) ఉమెన్స్ ఎంప్లాయీ సెంట్రల్ యూనియన్ నాలుగేళ్లుగా పదోన్నతుల కోసం సచివాల యం, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాల యం చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నాం. అయినా ఫలితం లేకుండా పోయింది. పీహెచ్ఎన్ లను కూడా పరిగణలోకి తీసుకుని సీహెచ్ఓ లుగా వెంటనే పదోన్నతులు ఇవ్వాలి.