ఫైజర్ టీకా వినియోగానికి అమెరికా ఒకే..

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం కొవిడ్-19 సెకెండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో అత్యవసరంగా వినియోగానికి ఫైజర్ వ్యాక్సిన్‌కు అమెరికా అంగీకారం తెలిపింది. అందుకు సంబంధించి యూఎస్ ఫుడ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ విభాగం అనుమతులు మంజూరు చేసింది.ఇప్పటికే యూకే, కెనడా దేశాల్లో ఫైజర్ టీకా వినియోగానికి అనుమతులు లభించాయి. తాజాగా ఇండియాలోనూ ఈ వ్యాక్సిన్ వినియోగానికి ఫైజర్ కంపెనీ ధరఖాస్తు చేసుకుంది. ఇదిలాఉండగా, ఫైజర్ టీకా వినియోగించిన కరోనా బాధితుల్లో పక్షవాత లక్షణాలు, చర్మం ఎరుపుగా మారడం వంటి […]

Update: 2020-12-12 00:57 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం కొవిడ్-19 సెకెండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో అత్యవసరంగా వినియోగానికి ఫైజర్ వ్యాక్సిన్‌కు అమెరికా అంగీకారం తెలిపింది. అందుకు సంబంధించి యూఎస్ ఫుడ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ విభాగం అనుమతులు మంజూరు చేసింది.ఇప్పటికే యూకే, కెనడా దేశాల్లో ఫైజర్ టీకా వినియోగానికి అనుమతులు లభించాయి. తాజాగా ఇండియాలోనూ ఈ వ్యాక్సిన్ వినియోగానికి ఫైజర్ కంపెనీ ధరఖాస్తు చేసుకుంది.

ఇదిలాఉండగా, ఫైజర్ టీకా వినియోగించిన కరోనా బాధితుల్లో పక్షవాత లక్షణాలు, చర్మం ఎరుపుగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తున్నట్లు మీడియా కథనాలు వెలువడుతున్నాయి.

Tags:    

Similar News