భారత్‌కు ప్రపంచ ఫార్మా దిగ్గజం ఫైజర్ అతిపెద్ద సాయం
దిశ, వెబ్‌డెస్క్: కరోనా సెకెండ్ వేవ్‌తో కష్టాలను ఎదుర్కొంటున్న భారత్‌కు ప్రపంచ ఫార్మా దిగ్గజ కంపెనీ ఫైజర్ అతిపెద్ద సాయం చేయనున్నట్టు ప్రకటించింది. కొవిడ్ మహమ్మారితో పోరాడుతున్న భారత్‌కు 70 మిలియన్ డాలర్లు(సుమారు రూ. 510 కోట్ల) విలువైన ఔషధాలను అందించనున్నట్టు తెలిపింది. ఈ మొత్తం కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద సాయమని కంపెనీ ఛైర్మన్, సీఈఓ ఆల్బర్ట్ బొర్లా అన్నారు. ఈ ఔషధాలను అమెరికా, యూరప్, ఆసియాలో ఉన్న తమ కంపెనీ పంపిణీ కేంద్రాల నుంచి భారత్‌కు […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా సెకెండ్ వేవ్‌తో కష్టాలను ఎదుర్కొంటున్న భారత్‌కు ప్రపంచ ఫార్మా దిగ్గజ కంపెనీ ఫైజర్ అతిపెద్ద సాయం చేయనున్నట్టు ప్రకటించింది. కొవిడ్ మహమ్మారితో పోరాడుతున్న భారత్‌కు 70 మిలియన్ డాలర్లు(సుమారు రూ. 510 కోట్ల) విలువైన ఔషధాలను అందించనున్నట్టు తెలిపింది. ఈ మొత్తం కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద సాయమని కంపెనీ ఛైర్మన్, సీఈఓ ఆల్బర్ట్ బొర్లా అన్నారు. ఈ ఔషధాలను అమెరికా, యూరప్, ఆసియాలో ఉన్న తమ కంపెనీ పంపిణీ కేంద్రాల నుంచి భారత్‌కు అందించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.
ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో భారత్‌కు సాధ్యమైనంత వేగంగా ఈ సాయం అందించే చర్యలు తీసుకోవాలని చెప్పారు. దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా బారిన పడిన వారికి ఫైజర్ ఔషధాన్ని ఉచితంగానే అంచిందాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు. దీనికోసం స్థానికంగా ఉన్న ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తామన్నారు. భారత్‌లో పరిస్థితులు తమకు ఆందోళన కలిగించాయని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటున్నట్టు ఆల్బర్ట్ వెల్లడించారు. అంతేకాకుండా బయోఎన్‌టెక్‌తో కలిసి రూపొందించే కరోనా వ్యాక్సిన్ విషయమై భారత్‌లో అనుమతుల కోసం ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని ఆల్బర్ చెప్పారు. వీలైనంత తొందరంగా అనుమతుల ప్రక్రియ పూర్తయ్యేందుకు అభ్యర్థించినట్టు తెలిపారు. సెకెండ్ వేవ్‌కు ముందే అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నామని, ప్రభుత్వం దీన్ని తిరస్కరించిందన్నారు.