మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. కేవలం నెల వ్యవధిలోనే చమురు ధరల్లో నాలుగోసారి పెరుగుదల నమోదైంది. వారాల వ్యవధిలో చమురు ధరలు పెరుగుతుండటంతో వాహనదారులు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్, డీజిల్ పై రూ.25 పైసలు పెంచింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర కొత్త రికార్డును నమోదు చేసింది. ప్రస్తుతం అక్కడ లీటర్ ధర రూ.85.70పైసలు ఉండగా.. ముంబైలో లీటర్ పెట్రోల్ […]

Update: 2021-01-23 07:06 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. కేవలం నెల వ్యవధిలోనే చమురు ధరల్లో నాలుగోసారి పెరుగుదల నమోదైంది. వారాల వ్యవధిలో చమురు ధరలు పెరుగుతుండటంతో వాహనదారులు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్, డీజిల్ పై రూ.25 పైసలు పెంచింది.

దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర కొత్త రికార్డును నమోదు చేసింది. ప్రస్తుతం అక్కడ లీటర్ ధర రూ.85.70పైసలు ఉండగా.. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.92.28గా ఉంది. ఇక హైదరాబాద్ విషయానికొస్తే లీటర్ పెట్రోల్ రూ.88.89, డీజిల్ ధర రూ.82.53గా నమోదైంది.

Tags:    

Similar News