మళ్లీ పేలిన ‘పెట్రో’ బాంబ్..

దిశ, వెబ్‌డెస్క్ : మరోసారి పెట్రో బాంబ్ పేలింది. కేంద్రం పెట్రోలియం శాఖ ఇంధన ధరల పట్టికను మరోసారి సవరించింది. తాజాగా నిర్ణయంతో దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్, డీజిల్ పై 30 పైసలు పెరిగాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.105.83గా ఉంది. ఇక ఏపీ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో రూ.108.06, డీజిల్ రూ.99.65 ఉండగా.. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.86, డీజిల్ రూ.99.45గా ఉంది. ఇదిలాఉండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధనంపై విధించే […]

Update: 2021-07-16 23:03 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మరోసారి పెట్రో బాంబ్ పేలింది. కేంద్రం పెట్రోలియం శాఖ ఇంధన ధరల పట్టికను మరోసారి సవరించింది. తాజాగా నిర్ణయంతో దేశవ్యాప్తంగా లీటర్ పెట్రోల్, డీజిల్ పై 30 పైసలు పెరిగాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.105.83గా ఉంది. ఇక ఏపీ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో రూ.108.06, డీజిల్ రూ.99.65 ఉండగా.. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.86, డీజిల్ రూ.99.45గా ఉంది.

ఇదిలాఉండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధనంపై విధించే పన్నులతో సామాన్యులు తలలు పట్టుకుంటున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు వరుస పెరుగుదలతో అటు నిత్యావసర ధరలు ఆకాశన్నంటుతున్నాయి. కొవిడ్ మహమ్మారి కారణంగా రెండు సార్లు విధించిన లాక్‌డౌన్ వలన ఆదాయం తగ్గి, చేసేందుకు పనులు లేక మధ్యతరగతి కుటుంబాలు నరకయాతన అనుభవిస్తున్నాయి.

Tags:    

Similar News