బ్లాక్ ఫంగస్‌పై హైకోర్టులో పిటిషన్.. నేడు విచారణ
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో ప్రస్తుతం కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయని సంతోషపడే లోపే బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతుంది. కరోనా సోకినవారిలో చాలా మంది హోం ఐసోలేషన్‌లోనే ఉంటూ మందులు వాడుతున్నారు. ఇందులో కొందరు ఇష్టమొచ్చినట్టుగా స్టెరాయిడ్లు, యాంటీబయాటిక్స్ ఉపయోగిస్తుండటంతో.. కరోనా నుంచి కోలుకున్నప్పటికి బ్లాక్ ఫంగస్ వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కరోనా నుంచి కోలుకున్న చాలా మందిలో ఈ బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ ఫంగస్ బారిన పడి ఇప్పటికీ ఎంతో […]
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో ప్రస్తుతం కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయని సంతోషపడే లోపే బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతుంది. కరోనా సోకినవారిలో చాలా మంది హోం ఐసోలేషన్‌లోనే ఉంటూ మందులు వాడుతున్నారు. ఇందులో కొందరు ఇష్టమొచ్చినట్టుగా స్టెరాయిడ్లు, యాంటీబయాటిక్స్ ఉపయోగిస్తుండటంతో.. కరోనా నుంచి కోలుకున్నప్పటికి బ్లాక్ ఫంగస్ వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కరోనా నుంచి కోలుకున్న చాలా మందిలో ఈ బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ ఫంగస్ బారిన పడి ఇప్పటికీ ఎంతో మంది మరణించారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం బ్లాక్ ఫంగస్ నివారణకు చర్యలు చేపట్టాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది జయంత్ జయసూర్య ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఇన్‌ఫెక్షన్ ఎక్కువై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చాలా మంది మరణింస్తున్నారు. దీంతో ఈ ఫంగస్ వలన ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని, ప్రభుత్వం బ్లాక్ ఫంగస్‌పై దృష్టి సారించి ప్రజల ప్రాణాలు కాపాడలని పిటిషనర్ కోరారు. లైపోసోమల్ ఆంపోటెరిసిన్-బి ఇంజెక్షన్ ఎక్కువగా ఉత్పత్తి చేసి అందుబాటులో ఉంచాలని లాయర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను నేడు హైకోర్టు విచారించనుంది.