పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పిటిషన్ దాఖలు

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: పాలమూరు జిల్లాలో నిర్మిస్తున్న పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై జడ్చర్ల నియోజకవర్గం ముదిరెడ్డిపల్లికి చెందిన కోస్గి వెంకటయ్య నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేశారు. ఉదండాపూర్ రిజర్వాయర్‌కు 16 కిలోమీటర్లు మేర నిర్మిస్తున్న కరకట్టకు పర్యావరణ అనుమతులు లేకుండా చెరువు మట్టిని వాడుతున్నారని వెంకటయ్య తన పిటిషన్లో పేర్కొన్నాడు. ఆ ఫిర్యాదు మేరకు.. పర్యావరణ అనుమతులు ఉల్లంఘనలు జరిగాయో లేదో తెలుసుకుని నివేదిక అందజేయాలని కమిటీని ఎన్జీటీ ఆదేశించింది. ఈ కమిటీలో […]

Update: 2021-07-09 06:37 GMT
National Green Tribunal
  • whatsapp icon

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: పాలమూరు జిల్లాలో నిర్మిస్తున్న పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై జడ్చర్ల నియోజకవర్గం ముదిరెడ్డిపల్లికి చెందిన కోస్గి వెంకటయ్య నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేశారు. ఉదండాపూర్ రిజర్వాయర్‌కు 16 కిలోమీటర్లు మేర నిర్మిస్తున్న కరకట్టకు పర్యావరణ అనుమతులు లేకుండా చెరువు మట్టిని వాడుతున్నారని వెంకటయ్య తన పిటిషన్లో పేర్కొన్నాడు. ఆ ఫిర్యాదు మేరకు.. పర్యావరణ అనుమతులు ఉల్లంఘనలు జరిగాయో లేదో తెలుసుకుని నివేదిక అందజేయాలని కమిటీని ఎన్జీటీ ఆదేశించింది.

ఈ కమిటీలో సభ్యులుగా కేంద్ర పర్యావరణ శాఖ ప్రాంతీయ కార్యాలయం సీనియర్ అధికారి, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి చెన్నై ప్రాంతీయ కార్యాలయం సైంటిస్ట్, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్, గనుల శాఖ డైరెక్టర్లు సభ్యులుగా ఉండి తనిఖీలు నిర్వహించి ఆగస్టు 27వ తేదీ లోపు నివేదికను సమర్పించాలని ఆదేశించింది. కోర్టు తదుపరి విచారణ 2021 ఆగస్టు 27న నిర్వహించనున్నారు.

Tags:    

Similar News