ఆ ఒక్కడి కోసం ‘మచుపిచు’ తెరుచుకుంది
దిశ, వెబ్‌డెస్క్: సినిమా చూడాలని ఫ్రెండ్స్ అందరూ కలిసి ప్లాన్ చేసుకున్నాక.. తీరా వెళ్లేముందు ఏదో కారణం వల్ల క్యాన్సిల్ అయితే ఎలా ఉంటుంది. చాలా అప్సెట్‌గా ఉంటుంది కదా! ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇండియా-పాక్ క్రికెట్ మ్యాచ్ ప్రారంభయ్యే ముందు వర్షం పడితే ఎంతలా చింతిస్తామో, సేమ్ అలానే జపాన్ నుంచి ఓ యాత్రికుడు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ‘మచుపిచు’ను చూడటానికి ఎంతో ఆరాటంగా వచ్చాడు. కానీ కరోనా వల్ల అనూహ్యంగా లాక్‌డౌన్ […]
దిశ, వెబ్‌డెస్క్: సినిమా చూడాలని ఫ్రెండ్స్ అందరూ కలిసి ప్లాన్ చేసుకున్నాక.. తీరా వెళ్లేముందు ఏదో కారణం వల్ల క్యాన్సిల్ అయితే ఎలా ఉంటుంది. చాలా అప్సెట్‌గా ఉంటుంది కదా! ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇండియా-పాక్ క్రికెట్ మ్యాచ్ ప్రారంభయ్యే ముందు వర్షం పడితే ఎంతలా చింతిస్తామో, సేమ్ అలానే జపాన్ నుంచి ఓ యాత్రికుడు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ‘మచుపిచు’ను చూడటానికి ఎంతో ఆరాటంగా వచ్చాడు. కానీ కరోనా వల్ల అనూహ్యంగా లాక్‌డౌన్ విధించడంతో చూడలేకపోయాడు. కానీ ఆ ఒక్కడి కోసం ‘మచుపిచు’ను ఓపెన్ చేయడం విశేషం.
జపాన్‌కు చెందిన బాక్సింగ్ కోచ్ జెస్సి కటయామా.. తన ప్రాంతమైన నార నుంచి పెరూలోని ‘మచుపిచు’ను చూడటానికి ఎంతో ఆత్రంగా, ఇష్టంగా వచ్చాడు. మార్చి మధ్యలో పెరూ చేరుకున్నాడు. ఇక ‘మచుపిచు’ చూడటమే ఆలస్యం. కానీ సరిగ్గా అప్పుడే కరోనా వల్ల దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. కటయామా మాత్రం ఎలాగైనా సరే, మచుపిచును చూడందే.. వెనక్కి వెళ్లేది లేదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అందుకోసం దాదాపు 7 నెలలు నిరీక్షించి తాజాగా తన కలను సాకారం చేసుకున్నాడు.
జపాన్ పర్యాటకుడు జెస్సి కటయామా గురించి సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ప్రభుత్వం.. కరోనా పాండమిక్ తర్వాత ఆ ఒక్కడి కోసమే ‘మచుపిచు’ను తిరిగి తెరిచింది. దాంతో కటయామా ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ‘లాక్‌డౌన్ తర్వాత మచుపిచును సందర్శించిన తొలి వ్యక్తిని నేను. నిజంగా నాకు ఇది నమ్మశక్యంగా లేదు. అసలు నేను మచుపిచును చూస్తానో లేదో అనుకున్నాను. కానీ మేయర్, ప్రభుత్వానికి తన గురించి చెప్పి తన కలను నిజం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని కటయామా తన ఇన్‌స్టాలో తెలియజేస్తూ.. తన మచుపిచును సందర్శించిన ఫొటోలను పంచుకున్నాడు.
జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల కోసం మచుపిచును నవంబర్‌లో ప్రారంభిస్తామని మినిస్టర్ నెయ్ర తెలిపాడు. రోజులో కేవలం 675 మంది పర్యాటకులను మాత్రమే మచుపిచుకు అనుమతిస్తామని.. కరోనా నుంచి ఇంకా బయటపడనందున, కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ పర్యాటకులను అనుమతిస్తామని వెల్లడించాడు.
మచుపిచును సందర్శించిన జపాన్ టూరిస్ట్ కటయామా.. పెరువియన్, జపనీస్ రెండు జాతీయ పతాకాలను పట్టుకుని కొండపై తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. లాక్ డౌన్ తర్వాత ఓపెన్ చేయడంతో.. పెరువియన్ అధికారులు, మచుపిచు మున్సిపాలిటీ అధికారులు ఆ టూరిస్ట్‌తో చిన్నపాటి సెర్మనీ చేసుకున్నారు.