కరోనా లక్షణాలతో గాంధీలో చేరిన వ్యక్తి మృతి
దిశ, ఆదిలాబాద్: కరోనా అనుమానిత లక్షణాలతో మంగళవారం గాంధీ ఆసుపత్రిలో చేరిన వ్యక్తి బుధవారం మృతి చెందడం కలకలం రేపుతోంది. మృతిచెందిన వ్యక్తి నిర్మల్ వాసి అని తెలుస్తోంది. మృతుడితో పాటే ఆసుపత్రిలో అతని సోదరుడు కూడా చేరినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో అక్కడి డాక్టర్‌పై మృతుడి సోదరుడు దాడి చేయడంతో అతనిపై కేసు నమోదు అయ్యింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమానికి హాజరై వచ్చిన వ్యక్తిని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా ఆయన చికిత్స పొందుతూ బుధవారం […]
దిశ, ఆదిలాబాద్:
కరోనా అనుమానిత లక్షణాలతో మంగళవారం గాంధీ ఆసుపత్రిలో చేరిన వ్యక్తి బుధవారం మృతి చెందడం కలకలం రేపుతోంది. మృతిచెందిన వ్యక్తి నిర్మల్ వాసి అని తెలుస్తోంది. మృతుడితో పాటే ఆసుపత్రిలో అతని సోదరుడు కూడా చేరినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో అక్కడి డాక్టర్‌పై మృతుడి సోదరుడు దాడి చేయడంతో అతనిపై కేసు నమోదు అయ్యింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమానికి హాజరై వచ్చిన వ్యక్తిని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా ఆయన చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందడం తీవ్ర
కలకలం సృష్టిస్తోంది. కాగా మృతిచెందిన వ్యక్తికి కరోనా సోకిందా? లేదా? అన్నది ఇంకా నిర్దారణ కాలేదని సమాచారం. అయితే ఆయన ఆస్పత్రిలోని బాత్‌రూమ్‌లో పడి మృతి చెందాడని
కూడా ప్రచారం జరుగుతోంది.
Tags: normal person, gandhi hospital, corona symptoms, death, delhi, adilabad