ఉద్యమకారుడి కుటుంబంలో విషాదం
దిశ, కల్వకుర్తి :తెలంగాణ మలిదశ ఉద్యమకారుడి కుటుంబంలో విషాదం నెలకొంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాడ్గుల మండలంలో ఆదివారం తెలంగాణ ఉద్యమకారుడు ఈరమల్ల చంటి తండ్రి ఈరమళ్ళ యాదయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకివెళితే.. గత మూడేండ్లుగా యాదయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ.. అనేక దఫాలుగా డయాలసిస్ చేయించుకునే క్రమంలో ఆర్థికంగా కుంగిపోయారు. వైద్య ఖర్చులు కోసం అప్పులు చేయడంతో కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. దీంతో మనస్తాపానికి గురైన ఆయన […]
దిశ, కల్వకుర్తి :తెలంగాణ మలిదశ ఉద్యమకారుడి కుటుంబంలో విషాదం నెలకొంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాడ్గుల మండలంలో ఆదివారం తెలంగాణ ఉద్యమకారుడు ఈరమల్ల చంటి తండ్రి ఈరమళ్ళ యాదయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకివెళితే.. గత మూడేండ్లుగా యాదయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ.. అనేక దఫాలుగా డయాలసిస్ చేయించుకునే క్రమంలో ఆర్థికంగా కుంగిపోయారు. వైద్య ఖర్చులు కోసం అప్పులు చేయడంతో కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. దీంతో మనస్తాపానికి గురైన ఆయన తాను కుటుంబానికి భారంగా తయారయ్యానని పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న నాగర్ కర్నూల్ జిల్లా జెడ్పీ వైస్ చెర్మన్ బాలాజీ సింగ్ యాదయ్య అంత్యక్రియలకు తన వంతు సాయంగా రూ. 5వేల ఆర్థిక సాయం ప్రకటించారు. దీనిని మాడ్గుల ఉద్యమ కారులు విష్ణు, పబ్బు శ్రీనివాస్ గౌడ్ , అన్నేపాక మహేష్, కట్ల జంగయ్య ద్వారా బాధిత కుటుంబానికి అందజేశారు.