ఈత కోసం వెళ్లి.. వ్యక్తి గల్లంతు

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : కృష్ణా నదిలో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రవాహంలో గల్లంతయ్యాడు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన కిరణ్ కుమార్ (24) అనే వ్యక్తి జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెళ్లి ఆంధ్రబ్యాంక్‌లో క్యాషియర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే, ఇవాళ మండల సమీపంలోని మంచాలకట్ట వద్ద కృష్ణా నదిలో మిత్రులతో కలిసి ఈతకు వెళ్ళాడు. ప్రమాదవశాత్తు కాలు జారీ […]

Update: 2020-09-01 00:50 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ :

కృష్ణా నదిలో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రవాహంలో గల్లంతయ్యాడు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన కిరణ్ కుమార్ (24) అనే వ్యక్తి జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెళ్లి ఆంధ్రబ్యాంక్‌లో క్యాషియర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

అయితే, ఇవాళ మండల సమీపంలోని మంచాలకట్ట వద్ద కృష్ణా నదిలో మిత్రులతో కలిసి ఈతకు వెళ్ళాడు. ప్రమాదవశాత్తు కాలు జారీ నది లోపలికి వెళ్లిపోవడంతో నీటిలో మునిగి ఊపిరాడక మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని గజ ఈతగాళ్ల సాయంతో కిరణ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Tags:    

Similar News