వజ్రం దొరికింది.. రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యాడు

దిశ, వెబ్‌డెస్క్ : రాయలసీమను రతనాల సీమ అని ఊరికే అనలేదు. అక్కడి భూముల్లో రత్నాలు, వజ్రాలు పొదిగి ఉన్నాయని అందరికీ తెలిసిందే. వర్షాకాలం సమీపించిందంటే స్థానికులు ఖాళీగా ఉన్న భూములు, పొలాల్లో రత్నాల కోసం వెతుకులాట ప్రారంభిస్తారు. ఈ క్రమంలోనే తాజాగా కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో ఓ వ్యక్తికి వజ్రం దొరకడంతో అదృష్టం కలిసొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఓ వ్యాపారి రూ.3 లక్షలు చెల్లించి అతని నుంచి వజ్రాన్ని కొనుగోలు చేశాడు. […]

Update: 2021-07-10 23:13 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రాయలసీమను రతనాల సీమ అని ఊరికే అనలేదు. అక్కడి భూముల్లో రత్నాలు, వజ్రాలు పొదిగి ఉన్నాయని అందరికీ తెలిసిందే. వర్షాకాలం సమీపించిందంటే స్థానికులు ఖాళీగా ఉన్న భూములు, పొలాల్లో రత్నాల కోసం వెతుకులాట ప్రారంభిస్తారు.

ఈ క్రమంలోనే తాజాగా కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో ఓ వ్యక్తికి వజ్రం దొరకడంతో అదృష్టం కలిసొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఓ వ్యాపారి రూ.3 లక్షలు చెల్లించి అతని నుంచి వజ్రాన్ని కొనుగోలు చేశాడు. బహిరంగ మార్కెట్లో దీని విలువ రూ.12లక్షలు ఉంటుందని సమాచారం. అయితే, నెలరోజుల వ్యవధిలో దాదాపు రూ.5 కోట్ల విలువైన వజ్రాలు లభ్యమైనట్లు తెలుస్తోంది.దీంతో రాత్రికి రాత్రే ఆ వ్యక్తి లక్షాధికారి కావడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News