రేకుల షెడ్డుల్లో కాలేజీలకు అనుమతినివ్వాలా !
దిశ, ఏపీ బ్యూరో: రేకుల షెడ్డుల్లో కాలేజీలు నడిపేవారికి అనుమతులు ఇవ్వాలా అని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. శనివారం ఆయన ప్రకాశం జిల్లాలో విలేకరులతో మాట్లాడుతూ సరైన వసతుల్లేని కళాశాలలకు అనుమతులను రెన్యువల్ చేయలేదని స్పష్టం చేశారు. 611కాలేజీలకు అనుమతులను రద్దు చేసినట్లు తెలిపారు. విద్యా సంస్కరణలకు అనుకూలంగా విద్యార్ధి సంఘాలు, తల్లిదండ్రులు రోడ్లమీదకు వచ్చి ఆందోళన చేసిన సంగతి గుర్తు చేశారు. షెడ్లల్లో, షాపింగ్ కాంప్లెక్సుల్లో నడిపే కాలేజీలపై కనికరం చూపేది లేదన్నారు. […]
దిశ, ఏపీ బ్యూరో: రేకుల షెడ్డుల్లో కాలేజీలు నడిపేవారికి అనుమతులు ఇవ్వాలా అని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. శనివారం ఆయన ప్రకాశం జిల్లాలో విలేకరులతో మాట్లాడుతూ సరైన వసతుల్లేని కళాశాలలకు అనుమతులను రెన్యువల్ చేయలేదని స్పష్టం చేశారు. 611కాలేజీలకు అనుమతులను రద్దు చేసినట్లు తెలిపారు. విద్యా సంస్కరణలకు అనుకూలంగా విద్యార్ధి సంఘాలు, తల్లిదండ్రులు రోడ్లమీదకు వచ్చి ఆందోళన చేసిన సంగతి గుర్తు చేశారు. షెడ్లల్లో, షాపింగ్ కాంప్లెక్సుల్లో నడిపే కాలేజీలపై కనికరం చూపేది లేదన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటిస్తూ ఇంటర్లో ఆన్‌లైన్ అడ్మిషన్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఫీజులను కూడా 30శాతం తగ్గించాలని ఆదేశించినట్లు మంత్రి సురేష్ వెల్లడించారు.